శ్రీ‌శైలం ఘటనలో మృత‌ుల సంఖ్య ఐదుకు చేరింది

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో మంట‌లు చెల‌రేగిన ప్రాంతం నుంచి ఎన్‌డీఆర్ఎఫ్‌ స‌హాయ‌క సిబ్బంది ఐదు మృత‌దేహాల‌ను వెలుప‌లికి తీసుకువచ్చారు. వీరిలో ఏఈలు సుంద‌ర్ నాయ‌క్‌(35‌), మోహన్, ఫాతిమా బేగం మృతి చెందినట్లు అధికారలు ధృవీకరించారు.

శ్రీ‌శైలం ఘటనలో మృత‌ుల సంఖ్య ఐదుకు చేరింది
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 21, 2020 | 3:17 PM

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో మంట‌లు చెల‌రేగిన ప్రాంతం నుంచి ఎన్‌డీఆర్ఎఫ్‌ స‌హాయ‌క సిబ్బంది ఐదు మృత‌దేహాల‌ను వెలుప‌లికి తీసుకువచ్చారు. వీరిలో ఏఈలు సుంద‌ర్ నాయ‌క్‌(35‌), మోహన్ కుమార్, ఉజ్మా ఫాతిమా బేగం మృతి చెందినట్లు అధికారలు ధృవీకరించారు. మ‌రో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఒక్కసారిగా విద్యుత్‌ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంట‌లు ఆరిపోగా పొగ‌లు మాత్రం ద‌ట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రాగా మ‌రో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఐదుగురు మృత్యువాత‌ప‌డ్డారు. మిగ‌తా న‌లుగురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. విధ్యుత్ ఫ్లాంట్ లో చిక్కుకుపోయిన వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.