తెలంగాణ.. రికార్డు స్థాయిలో భారీ వర్షం..
అల్పపీడన ద్రోణీ ప్రభావం కారణంగా గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
Heavy Rains In Telangana: అల్పపీడన ద్రోణీ ప్రభావం కారణంగా గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొమురం భీం జిల్లా పెంచికల్పేట్‌లో సాధారణం కంటే 13.3 సెంటీమీటర్ల ఎక్కువ వర్షపాతం నమోదు కాగా.. మంచిర్యాల జిల్లా భీమినిలో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే ములుగు జిల్లాలో ఏడు సెంటీమీటర్లు నమోదైంది.
ఇక ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే సరూర్ నగర్‌లో 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు చార్మినార్, రాజేంద్రనగర్, ఉప్పల్, బండ్లగూడ ప్రాంతాల్లో రెండేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ఓవరాల్‌గా రాష్ట్రంలో 13 సెంటీమీటర్లు పైగా అతి భారీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
Also Read:
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..