తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..

ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ పశువులను వెంటాడుతోంది.

తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..
Follow us

|

Updated on: Aug 18, 2020 | 2:09 AM

Lumpy Skin Disease In Telangana: ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ పశువులను వెంటాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 11 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. మే-జూన్ నెలల్లో వనపర్తి జిల్లాలో  విజృంభించిన ఈ వైరస్ ఇప్పుడు ఆదిలాబాద్ రైతాంగానికి నిద్ర లేకుండా చేస్తోంది. అదే లంపీ స్కిన్ అనే డిసీజ్. ఇది పశువుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందట.

ఆవులకు, ఎద్దులకు, దూడలకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధి సోకిన మూగజీవాల చర్మంపై బొబ్బలు, బొడిపెలు వస్తాయి. వ్యాధిని ముందుగానే కనిపెట్టి చికిత్స అందిస్తే నయం చేయొచ్చని వైద్యులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి బారినపడ్డ ఒక్కో పశువుకు రూ. 1500 ఖర్చు అవుతుందని తెలుస్తోంది. తాజాగా ఈ లంపీ స్కిన్ కారణంగా తలమడుగులో ఓ ఎద్దు చనిపోయింది.

Also Read:

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..