కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 64,531 కేసులు, 1092 మరణాలు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1092 మరణాలు సంభవించాయి.
Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1092 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,67,274కి చేరుకుంది. ఇందులో 6,76,514 యాక్టివ్ కేసులు ఉండగా.. 52,889 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 20,37,871 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మూడు లక్షలు కరోనా కేసులు దాటిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీలో ఇప్పుడు 3,06,261 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మార్చి 12న ఏపీలో మొదటి కేసు నమోదు కాగా.. అక్కడ మూడు లక్షల కేసులు రావడానికి 160 రోజులు పట్టింది. ఇక చివరి లక్ష కేసులు కేవలం 11 రోజుల్లో నమోదు కావడం గమనార్హం. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 73.18 శాతం ఉండగా.. మరణాల రేటు 1.92 శాతంగా ఉంది.
Also Read:
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..