తెలంగాణ‌లో48 గంట‌లపాటు తేలిక‌పాటి వాన‌లు

తెలంగాణ రాష్ట్రంలో 48 గంట‌ల పాటు తేలిక పాటి వాన‌లు కుర‌వ‌నున్నాయని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ‌ ప్ర‌క‌టించింది. ఈశాన్య బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో 5.8 కిలో మీట‌ర్ల నుంచి 7.6 కిలో మీట‌ర్ల ఎత్తు మ‌ధ్య ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం..

తెలంగాణ‌లో48 గంట‌లపాటు తేలిక‌పాటి వాన‌లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2020 | 9:30 AM

గ‌త వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసిన విష‌యం తెలిసిందే. ఈ భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగ‌డంతో ప‌లు ఇళ్లు నీట మునిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి. ఇక సోమ‌వారం కాస్త ఉప‌శ‌మ‌నం ఇచ్చినా మ‌ళ్లీ మంగ‌ళ‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 48 గంట‌ల పాటు తేలిక పాటి వాన‌లు కుర‌వ‌నున్నాయని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ‌ ప్ర‌క‌టించింది. ఈశాన్య బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో 5.8 కిలో మీట‌ర్ల నుంచి 7.6 కిలో మీట‌ర్ల ఎత్తు మ‌ధ్య ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. దీని ప్ర‌భావంతో ఉత్త‌ర బంగాళాఖాతం ప్రాంతంలో బుధ‌వారం ఉద‌యం అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్నది. రానున్న 24 గంట‌ల్లో ఇది మ‌రింత బ‌ల‌ప‌డి ప‌శ్చిమ దిశ‌గా ప్ర‌యాణించే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. దీని ప్ర‌భావంతో నేటి నుంచి 48 గంట‌ల పాటు తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Read More:

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ