క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి

ఇప్పుడు మ‌రో త‌మిళ‌నాడు మంత్రికి కోవిడ్ సోకింది. త‌మిళ‌నాడు ర‌వాణాశాఖ మంత్రి విజ‌య భాస్క‌ర్ మంగ‌ళ‌వారం క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు, ఆయ‌న‌తో కాంటాక్ట్ ఉన్న ప‌లువురికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు..

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 8:45 AM

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను వ‌ద‌లడం లేదు. అధికార‌, విప‌క్షాల‌కు చెందిన ప‌లువు రు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కులు సైతం కోవిడ్ బారిన ప‌డుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఎంతో మంది రాజ‌కీయ నాయకులు ఈ వైర‌స్ బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇప్పుడు మ‌రో త‌మిళ‌నాడు మంత్రికి కోవిడ్ సోకింది. త‌మిళ‌నాడు ర‌వాణాశాఖ మంత్రి విజ‌య భాస్క‌ర్ మంగ‌ళ‌వారం క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు, ఆయ‌న‌తో కాంటాక్ట్ ఉన్న ప‌లువురికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు అధికారులు.

ఇక త‌మిళ‌నాడు వ్యాప్తంగా మంగ‌ళ‌వారం 5,709 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్థార‌ణ కాగా, మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,49,653కు చేరాయి. అలాగే నిన్న‌ 121 మంది మృతి చెంద‌గా, మొత్తం చ‌నిపోయిన వారి సంఖ్య 6,007కు చేరింది.

Read More:

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ