Highway: విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
అరుణాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చైనా సరిహద్దులకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. ఈ ఘటనతో చైనా బోర్డర్‌ను కలిపే జాతీయ రహదారి NH 313 చాలా వరకు ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చైనా సరిహద్దులకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. ఈ ఘటనతో చైనా బోర్డర్‌ను కలిపే జాతీయ రహదారి NH 313 చాలా వరకు ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రోడ్డుకు మరమ్మతు చేసే పనిలో పడ్డారు నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ సంస్థ అధికారులు. అందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సాయం అందిస్తున్నారు. ఆహార పదార్థాలతో పాటు ఇతరత్రా నిత్యావసరాలను పంపుతున్నారు. భారత్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతానికి వెళ్లేందుకు ఇదొక్కటే దారి. ఇప్పుడీ రహదారి ధ్వంసమవడం వల్ల ఆందోళన నెలకొంది.
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు ఈ దారిలో ఎవరూ వెళ్లకూడదని తేల్చి చెప్పింది. మరమ్మతులు పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుందని, వర్షాలు కురుస్తున్నందున ఆలస్యం అయ్యే అవకాశముందని వెల్లడించింది. రోడ్డు పై రాకపోకలను త్వరలో పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోందని ముఖ్యమంత్రి పేమా ఖండు ట్విట్టర్‌లో సందేశం పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

