Neha Sharma: తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
ఎర్లీ మార్నింగ్ ఏసీలో జిమ్ చేసుకోవడం.. లగ్జరీ కార్లో షికారు షూట్లకు ఫోటో షూట్లకు వెళ్లడం.. సాయంత్రాలు పార్టీలు చేసుకోవడం.. మధ్యలో హాట్ హాట్ రీల్స్ చేసి ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ కలిగించడం. ఇలా అన్నట్టుగా ఉండే నేహా శర్మ షెడ్యూల్ ఇప్పుడు తన తండ్రి కారణంగా మారిపోయింది. కష్టపడుతూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతోంది.
ఎర్లీ మార్నింగ్ ఏసీలో జిమ్ చేసుకోవడం.. లగ్జరీ కార్లో షికారు షూట్లకు ఫోటో షూట్లకు వెళ్లడం.. సాయంత్రాలు పార్టీలు చేసుకోవడం.. మధ్యలో హాట్ హాట్ రీల్స్ చేసి ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ కలిగించడం. ఇలా అన్నట్టుగా ఉండే నేహా శర్మ షెడ్యూల్ ఇప్పుడు తన తండ్రి కారణంగా మారిపోయింది. కష్టపడుతూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో లోక్ సభ, మరికొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ తారలు కూడా పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నటీనటులు పోటీ పడుతుండగా.. మరికొందరు తమ నాయకులకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ కూడా ఎన్నికల ప్రచారంలోకి తన తండ్రి తరపున దిగారు. భాగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన తండ్రి అజిత్ శర్మ పోటీ చేస్తుండడంతో.. ఆయన తరుపున ప్రచారం మొదలెట్టారు నేహా శర్మ. ఈ క్రమంలోనే తాజాగా బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఎండల్లో ఎంత కష్టమైనా.. తనను చేసేందుకు వచ్చిన జనాల్ని నవ్వుతూ పలకరిస్తూ.. తన తండ్రిని ఎలక్షన్స్‌లో గెలిపించాలని కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.