Mohanlal vs Chiranjeevi: మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అంచనాలు తప్పుతుంటాయి. సూపర్ డూపర్ హిట్టవుతాయనుకున్నసినిమాలే.. ఫట్టవుతుంటాయి. భారీ డిజాస్టర్లుగా ఫిల్మ్ హిస్టరీకెక్కుతుంటాయి. అలా అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మృగరాజు విషయంలోనూ జరిగింది ఇదే.! అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. మరో స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాస్తా.. చిరు చేశారని..
ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అంచనాలు తప్పుతుంటాయి. సూపర్ డూపర్ హిట్టవుతాయనుకున్నసినిమాలే.. ఫట్టవుతుంటాయి. భారీ డిజాస్టర్లుగా ఫిల్మ్ హిస్టరీకెక్కుతుంటాయి. అలా అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మృగరాజు విషయంలోనూ జరిగింది ఇదే.! అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. మరో స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాస్తా.. చిరు చేశారని.. అలా చేయకుంటే ఈ ఫట్టు చిరు ఖాతాలో ఉండకపోయేదనే కామెంట్ వస్తోంది.
ఇక ఒక్కడు సూపర్ డూపర్ హిట్టుతో మాంచి ఫామ్లో ఉన్న గుణశేఖర్ హాలీవుడ్ ఇన్పిరేషన్‌తో మృగరాజు కథను రాసుకున్నారు. భారీ స్పాన్‌తో గ్రాఫిక్ ఓరియెంటెడ్ మూవీగా ఈ మూవీని తెరకెక్కిచాలనుకున్నాడు. అంతేకాదు హీరోగా మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ అయితే బాగుండని.. ఈ స్టోరీతో ఆ హీరోను అప్రోచ్ కూడా అయ్యారట. అయితే ఆ హీరో డేట్స్ నచ్చకపోవడం.. చిరు మృగరాజు సినిమా స్టోరీ బాగా నచ్చడంతో.. ఈ మూవీ చిరు చేతికి వచ్చింది.
భారీ స్కేల్లో తెరకెక్కి 2001లో గ్రాండ్‌గా రిలీజైంది. అయితే రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత మాత్రం చతికిలపడిపోయింది. బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అలా.. మోహన్ లాల్ డేట్స్ ఎఫెక్ట్ తో ఈ మూవీ చిరు ఖాతాకు వచ్చి.. ఆయన సక్సెస్‌కు బ్రేక్ వేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.