Brahmamudi, April 27th episode: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావాలనే కావ్యను ఇరికించడానికి.. రుద్రాణి అనామికతో కలిసి ప్లాన్ చేస్తుంది. కళ్యాణ్ నీకు కావాలా.. అప్పూని వదిలి పెట్టాలా.. అయితే నేను చెప్పినట్టు చెయ్ అని రుద్రాణి అంటుంది. నేనోంటో చూపిస్తా.. సరే ఆంటీ మీరు చెప్పినట్లే చేస్తాను. నా మొగుడు నాకు ముఖ్యం అని వెళ్తుంది అనామిక. ఇప్పుడు ఈ అణుబాంబును ఆ కావ్య ఎలా ఆపుతుందో నేనూ చూస్తాను. ఒక వైపు అప్పూ కోసం..

Brahmamudi, April 27th episode: రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
Brahmamudi
Follow us

|

Updated on: Apr 27, 2024 | 12:43 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావాలనే కావ్యను ఇరికించడానికి.. రుద్రాణి అనామికతో కలిసి ప్లాన్ చేస్తుంది. కళ్యాణ్ నీకు కావాలా.. అప్పూని వదిలి పెట్టాలా.. అయితే నేను చెప్పినట్టు చెయ్ అని రుద్రాణి అంటుంది. నేనోంటో చూపిస్తా.. సరే ఆంటీ మీరు చెప్పినట్లే చేస్తాను. నా మొగుడు నాకు ముఖ్యం అని వెళ్తుంది అనామిక. ఇప్పుడు ఈ అణుబాంబును ఆ కావ్య ఎలా ఆపుతుందో నేనూ చూస్తాను. ఒక వైపు అప్పూ కోసం.. మరోవైపు అత్తారింటిని ఎలా కాపాడుతుందో నేనూ చూస్తాను అని రుద్రాణి అంటుంది. ఈ సీన్ కట్ చేస్తే.. ధాన్య లక్ష్మి.. అనామికను వెతుకుతూ ఉంటుంది. కిందకు వచ్చి స్వప్న దగ్గరకు వెళ్లి.. మా అనామికను చూశావా అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. మీ అనామిక.. మా అనామిక.. ఏంటి? ఇక్కడ ఇద్దరు ఉన్నారా? ఉన్నది ఒక్క అనామికనే కదా అని స్వప్న అంటుంది. సరే ఆ ఒక్క అనామికనే చూశావా? అని ధాన్య లక్ష్మి అంటే.. నేను చూడలేదని స్వప్న చెబుతుంది.

అనామిక ఎవరు? అని అడిగిన కళ్యాణ్

ఇంతలో ఏమైందే అని ప్రకాష్ అడుగుతాడు. అనామిక కనిపించడం లేదని ధాన్యం చెబుతుంది. ఈలోపు కళ్యాణ్ దగ్గరకు వెళ్లి అనామిక ఏది? అని అడుగుతుంది. అనామిక ఎవరు? అని కళ్యాణ్ అడుగుతాడు. మీ నాన్న మతిమరుపు నీకు కూడా వచ్చిందా? అనామిక నీ భార్యరా అని ధాన్య లక్ష్మి అంటుంది. అవునా నాకు భార్యలా ఏనాడూ అనిపించలేదులే. నీ ముద్దుల కోడలిలానే అనిపించిందిలే అని కళ్యాణ్ అంటాడు. సరే అనామిక ఎక్కడ? అని ధాన్యలక్ష్మి అడిగితే.. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? నేను చూడలేదని కళ్యాణ్ అంటాడు. ఏరా నిజం చెప్పు మళ్లీ ఏమైనా గొడవ జరిగిందా? అని ధాన్య లక్ష్మి అంటే.. గొడవ లేనిది ఏ రోజు ఉంది చెప్పు.. ఏనాడైనా నన్ను భర్తగా గుర్తించిందా? ఎక్కడికైనా చెప్పి వెళ్తుందా? తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది? నాకేం తెలుస్తుంది అమ్మా అని కళ్యాణ్ చెప్తాడు. ఎన్నడై లేనిది ఎందుకు ఇంత ఆవేశం రా చెప్పు అని ఇందిరా దేవి అడుగుతుంది.

Brahmamudi (1)

ఇవి కూడా చదవండి

రుద్రాణి ఫిటింగ్..

అప్పుడే రుద్రాణి లేచి వచ్చి.. అమ్మా వాడి మొహం.. ఆవేశం చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇద్దరూ ఏదో గొడవ పడినట్టు ఉంటారు. వీడే ఏదో అని ఉంటాడు. తిట్టాడో.. కొట్టాడో.. కనుక్కోండి అని రుద్రాణి అంటే.. అత్తా మీ పనులు మీరు చేసుకోండి అని కళ్యాణ్ అంటాడు. తర్వాత కావ్య కూడా అనామిక ఎక్కడా అని అడిగితే.. నిజంగానే నాకు తెలీదు వదినా అని కళ్యాణ్ చెప్తాడు. వీడు తెలీదు అన్నాడంటే ఖచ్చితంగా తెలీదు. వీడు అబద్ధం చెప్పడు. అనామికకు ఫోన్ చేశావా పిన్నీ అని రాజ్ అడుగుతాడు. స్విచ్ ఆఫ్ వస్తుందని ధాన్యం అంటాడు. అప్పుడే కళ్యాణ్ గుడిలో అనామికను కొట్టిన విషయం గుర్తుకు తెచ్చుకుంటాడు.

అప్పూని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే పోలీసులు వచ్చి అప్పూ ఎవరు? అని అడుగుతారు. నేనే అని అప్పూ అంటే.. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్తారు. అదేంటి? నా కూతురు ఏం తప్పు చేసిందని కనకం అడిగితే.. అదంతా పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాట్లాడండి అని అంటారు. అసలు కారణం ఏంటో చెప్పకుండా నా కూతుర్ని రానిచ్చేది లేదని కనకం అంటే.. అనామిక మీ అమ్మాయి మీద కేసు పెట్టింది. వాళ్ల భర్త, ఈ అమ్మాయి.. మానసికంగా తనను హింసిస్తున్నారని గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు. అని అప్పూని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీసులు. ఇక ఆవేశంతో ఊగిపోతుంది కనకం. ఆ అనామికను వదిలి పెట్టను అని అంటుంది.

దుగ్గిరాల ఇంటికి పోలీసులు.. షాక్‌లో ఫ్యామిలీ..

నిజం చెప్పరా.. ఏం జరిగింది అని ధాన్యం అడిగితే.. కోపం వచ్చింది అందుకే కొట్టాను అని కళ్యాణ్ అంటాడు. అదేంట్రా ఎందుకు కొట్టావ్? అని ప్రకాష్, సుభాష్ కళ్యాణ్‌ని మందలిస్తారు. ఎవరైనా భరించలేని ఆవేశంతోనే కొడతారు అని కళ్యాణ్ అంటుండగా.. అప్పుడే అనామిక పోలీసులను తీసుకొచ్చి.. విన్నారా అని అంటుంది. పోలీసులు రావడంతో అందరూ షాక్ అవుతారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ నేను భరించలేను. మీ డ్యూటీ మీరు చేయండి. అనామిక ఏంటిది అని ధాన్య లక్ష్మి అడిగితే.. క్షమించండి అత్తయ్యా.. నేను మీ అబ్బాయి మీద కేసు పెట్టాను అని అనామిక అంటుంది. నువ్వు స్పృహలో ఉండే ఈ పని చేస్తున్నావా అని అపర్ణ, ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం ముందు పోలీసులను పంపించు అని సుభాష్ అంటారు. కానీ అనామిక వినిపించుకోదు.

ఈ వైలెన్స్ నేను భరించలేక పోతున్నా..

నాకు ఈ ఇంట్లో అన్యాయం జరుగుతుంది. అప్పూతో తిరగడం ఇంకా ఆపడం లేదని అనామిక అంటుంది. ఏయ్ అసలు బుద్ధి ఉందా? వాళ్లిద్దరూ ఫ్రెండ్సే. అది కూడా అర్థం చేసుకోవడం లేదా నువ్వు. ఏ పాపం తెలీని కళ్యాణ్ మీద కేసు పెట్టావంటే.. నీకు మూర్ఖత్వం ఎంత ఉందో అర్థం అవుతుందని స్వప్న అంటుంది. ఇన్స్ స్పెక్టర్ గారు ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. మాట్లాడుకుంటే పోయేదానికి.. కేసు దాకా వెళ్లకండని రాజ్ అంటే.. ఇది మాట్లాడుకుంటే తెగిపోయే సమస్య కాదు. అప్పూ అనే అమ్మాయితో తిరుగుతూ.. పెళ్లి చేసుకుని తీసుకొచ్చేంత ఘాడమైన ప్రేమలో ఉన్నాడు అని అనామిక అంటుంది. ఇదేంటి అని అడిగినందుకు నన్ను కొట్టి, హింసిస్తున్నాడు అని అనామిక అంటుంది. ఆ తర్వాత కూడా కావ్య కూడా సర్ది చెప్పాలని చూస్తుంది.

అనామికకు పెద్దావిడ వార్నింగ్..

ఇక అప్పుడు పెద్దావిడ రియాక్ట్ అవుతుంది. అత్తారింట్లో ఎలా మసులు కోవాలో తెలుసుకో. ఇన్నాళ్లూ చిన్న పిల్లల చేష్టలు అని చూసీ చూడనట్టు వదిలేస్తే.. ఇంత ధైర్యం చేస్తావా? అని తిడుతుంది. పెద్ద వాళ్లం మేము ఉన్నాం కదమ్మా.. మీ అమ్మానాన్నలను తీసుకొచ్చి మాట్లాడిస్తే వదిలిపోయే దానికి.. ఇంత వరకూ వెళ్లడం సమంజసం కాదని సీతారామయ్య అంటాడు. కేసుకు భయపడో లేక పరువు పోతుందని బెదిరి పోయే ఇక్కడ ఎవరూ మాట్లాడటం లేదు. నీ బంధాన్ని నువ్వే చిక్కు ముడి చేసుకోద్దని హెచ్చరిస్తున్నాని వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. సారీ సర్ మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. కానీ ఈ అమ్మాయికి నచ్చ చెప్పేలా చూస్తే వినేలా లేదు. తనంతట తానే కేసు వాపస్ తీసుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే వెళ్లి పోతామని పోలీసులు అంటారు.

అనామికను బెదిరించిన అత్తగారు..

విన్నావ్ కదా.. కేసు వాపస్ తీసుకో.. అప్పూ విషయంలో ఏం చేయాలో అది చేస్తాను అని ధాన్య లక్ష్మి అంటే.. అనామిక రుద్రాణి వైపు చూస్తుంది. రుద్రాణి వద్దని తల అడ్డంగా ఊపుతుంది. దీంతో ధాన్య లక్ష్మి గట్టిగా కేసు వాపస్ తీసుకో అని అనామిక అని అంటుంది. నాకు మాత్రం నా భర్త జైలుకు వెళ్లాలని ఉందా అత్తాయ్యా.. చాలా సార్లు అప్పూ విషయంలోనే మాకు గొడవలు వస్తున్నాయి. అప్పూ నాకు సవతిలా దాపరించేలా ఉంది. ఇలానే వదిలేస్తే.. కావ్య అక్కకు జరిగిన అన్యాయమే నాకు జరిగేలా ఉంది. కాబట్టి జీవితంలో అప్పూతో కళ్యాణ్ కలవకూడదు. నాకు సారీ చెప్పాలి అని కండీషన్ పెడుతుంది అనామిక.

నీకు సారీ చెప్పాలా.. జైలుకు వెళ్లిన కళ్యాణ్..

ఏంటీ నీకు సారీ చెప్పాలా? ఇంకా నేను నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావ్? అప్పూతో నా స్నేహం చాలా పవిత్రమైనది. అది నీకు అర్థం కాదు. నువ్వు మా పరువు ఈ స్థాయికి దిగజార్చావ్. జీవితాంతం జైలులో అయినా ఉంటాను కానీ.. నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నీలాంటి దానితో కాపురం చేయడమే.. యావజ్జీవ శిక్షతో సమానం అని కళ్యాణ్ అంటాడు. సర్ తొందర పడకండి అని ఇన్ స్పెక్టర్ అంటే.. ఇంత చిన్న విషయానికి కూడా పోలీసు కేసు పెట్టిన ఈ ఆడదా తొందర పడింది? నేనా? ఏం జరిగితే అది జరిగింది. నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లండి అని కళ్యాణ్ వెళ్తాడు. ఇక ఇవాళ్టితో ఇక్కడి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

Latest Articles
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్