27 April 2024
రెడీగా ఉండండి.. ప్రభాస్ వస్తున్నాడు.. కల్కి రిలీజ్ డేట్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 28798 ఏడీ. ఈ సినిమా పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అంచనాల గురించి చెప్పక్కర్లేదు.
ఈ సినిమా కోసం నాగ్ సృష్టించిన సరికొత్త లోకాన్ని చూడాలని.. అలాగే 6000 ఏళ్ల నాటి కథను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటాని, కమల్ హసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని బజ్ నెలకొంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇటీవలే అమితాబ్ పాత్రను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ ఎన్నికల కారణంగా ఈ మూవీ వాయిదా పడిందట.
దీంతో ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా మరో కొత్త డేట్ తెరపైకి వచ్చింది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ఈ డేట్ బ్లాక్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది.
అయితే కల్కి రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ డేట్ అనౌన్స్ చేయనున్నారంటూ టాక్ వినిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.