ANIL KUMAR POKA

ఎన్నాళ్లకెన్నాళ్లకి.! సూర్య - జ్యోతిక జోడిగా సినిమా.. 

27 April 2024

కోలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు వీరిద్దరూ.

వీరి పెయిర్ చూసిన ఎవారైన వావ్ అనాల్సిందే.. ఇద్దరు పిల్లలతో ఎంతో అనన్యంగా కనిపిస్తుంటారు సూర్య, జ్యోతిక.

మొన్న ఈ మధ్య వీరి ఇద్దరి ఆస్తుల గురించి కూడా వార్తలు వచ్చాయి.. నెటిజన్స్ పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేసారు.

సూర్య కంటే జ్యోతిక ఆస్తులే ఎక్కువ అని.. సూర్య కంటే 125 కోట్ల వ‌ర‌కు ఎక్కువ‌ అని హాట్ టాపిక్ అయ్యింది.

యూనిక్ కంటెంట్ తో సినిమాలు చేసే సూర్య - జ్యోతిక జోడీ అనగానే తమిళంలో పలు హిట్‌ సినిమాలే గుర్తుకొస్తాయి.

వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి దాదాపు 18 ఏళ్లయింది. వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్.

లేటెస్ట్ గా ఈ జోడీ కలిసి ఓ సినిమా చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్‌చల్‌  చేస్తున్నాయి..

బెంగుళూరు డేస్‌ ఫేమ్‌ అంజలి మేనన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేస్తారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.