Heart Transplant: పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్‌ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. మానవత్వానికి ఎల్లలు లేవనే విషయం మరోసారి రుజువైంది. ఓ భారతీయుడి హృదయం పాకిస్థాన్‌ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఓ ఆసుపత్రి వైద్యులు చేసిన అవయవ మార్పిడి విజయవంతమైంది.

Heart Transplant: పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.!  మానవత్వం చాటిన వైద్యులు.

|

Updated on: Apr 27, 2024 | 12:27 PM

హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్‌ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. మానవత్వానికి ఎల్లలు లేవనే విషయం మరోసారి రుజువైంది. ఓ భారతీయుడి హృదయం పాకిస్థాన్‌ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఓ ఆసుపత్రి వైద్యులు చేసిన అవయవ మార్పిడి విజయవంతమైంది. అంతేకాదు వైద్యులు, ఆస్పత్రి, ట్రస్టు.. అందరూ ఒక్క పైసా తీసుకోకుండా ఆమె ప్రాణాలు నిలిపారు.

పాకిస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల రశన్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయ మార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. లేదంటే ఆమె ఎక్కువకాలం బతకదంటూ తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు 35 లక్షల రూపాయలు ఖర్చవుతుండడంతో.. తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రశన్‌ను ఆదుకునేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఆమెకు భారత్‌లో సర్జరీకి ఏర్పాట్లు చేసింది. చెన్నైలోని ఎమ్‌జీఎమ్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో నిపుణుల బృందం యువతికి.. అవయవదానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది. ఒక్క రూపాయి తీసుకోకుండా ఎంతో శ్రమించి ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మానవత్వానికి ఎల్లలు అడ్డు కావని నిరూపించింది. ప్రస్తుతం రశన్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్టు, వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us