కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు – హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రచారం గురించి మాట్లాడుతూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థమైందని అన్నారు. దేశం మొత్తానికి తెలంగాణ అభివృద్ధిలో రోల్ మోడల్ అయిందని.. పని తీరులో మన ముఖ్యమంత్రి దేశానికే నెంబర్ వన్ గా ఉన్నారని […]

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రచారం గురించి మాట్లాడుతూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు అర్థమైందని అన్నారు. దేశం మొత్తానికి తెలంగాణ అభివృద్ధిలో రోల్ మోడల్ అయిందని.. పని తీరులో మన ముఖ్యమంత్రి దేశానికే నెంబర్ వన్ గా ఉన్నారని తెలిపారు. ఇకపోతే తెలంగాణ పధకాలు దేశానికీ ఆదర్శంగా మారాయి అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి ఈ రాష్ట్రంలో దయనీయంగా మారింది. సీట్లు గెలిచే పరిస్థితి కన్నా.. మిగిలిన ఓట్లు ఏరుకునే పరిస్థితి కాంగ్రెస్, బీజేపీలది. ఇక్కడ మనకు మనమే పోటీ. ఇక జహీరాబాద్ లో జరిగిన రాహుల్ సభకు జనం లేరు. తెలంగాణ కాంగ్రెస్ కు కార్యకర్తలే కరువయ్యారని… బీజేపీ తెలంగాణలో ఒక్క సీట్ కూడా గెలవదని ఆయన తెలిపారు. ఇకపోతే నర్సాపూర్ లో లక్ష ఎకరాలకు గోదావరి నీళ్లు తేవడమే తెరాస లక్ష్యం’ అని హరీష్ రావు చెప్పారు.
