AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీకి ఫేస్‌బుక్ భారీ షాక్.. 687 ఎఫ్బీ పేజీల తొల‌గింపు

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ భారీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 687 ఫేస్‌బుక్ పేజీలను తొలగించింది. సామాజిక మాధ్యమ వేదికపై.. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌ న‌కిలీ అకౌంట్లు, పేజీల‌ను తొల‌గించిన‌ట్లు ఇవాళ ఫేస్‌బుక్ వెల్ల‌డించింది. కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ఉన్న అకౌంట్ల తీరు స‌రిగా లేదని..  నిజాయితీలేని ప్రవర్తన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఫేస్‌బుక్ సైబ‌ర్‌సెక్యూర్టీ హెడ్ […]

కాంగ్రెస్ పార్టీకి ఫేస్‌బుక్ భారీ షాక్.. 687 ఎఫ్బీ పేజీల తొల‌గింపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2019 | 5:24 PM

Share

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ భారీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 687 ఫేస్‌బుక్ పేజీలను తొలగించింది. సామాజిక మాధ్యమ వేదికపై.. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌ న‌కిలీ అకౌంట్లు, పేజీల‌ను తొల‌గించిన‌ట్లు ఇవాళ ఫేస్‌బుక్ వెల్ల‌డించింది. కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ఉన్న అకౌంట్ల తీరు స‌రిగా లేదని..  నిజాయితీలేని ప్రవర్తన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఫేస్‌బుక్ సైబ‌ర్‌సెక్యూర్టీ హెడ్ న‌థానియ‌ల్ గ్లిచ‌ర్ తెలిపారు. యూజ‌ర్ల‌ను త‌మ పోస్టుల‌తో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందువ‌ల్లే ఫేక్ అకౌంట్ల‌ను తొల‌గించామని తెలిపారు. వాస్త‌వానికి ఆ పోస్టుల్లో ఉండే స‌మాచారంతో సంబంధం లేద‌ని, కానీ ఫేస్‌బుక్‌ని అనుచిత ప‌ద్ధ‌తుల్లో వాడ‌టాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించలేదు.

మరోవైపు ఫేస్‌బుక్ అనుసంధానంగా ఉన్న ఇన్‌స్టాగ్రాంకి సంబంధించిన 103 పేజీల‌ను తొల‌గించామ‌ని ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఈ నెట్‌వ‌ర్క్ కొన‌సాగుతున్న‌ట్లు గుర్తించారు. పాకిస్థాన్ నుంచి ఫేక్ అకౌంట్ల‌ను ఆప‌రేట్ చేస్తున్నందున వాటిని తొల‌గిస్తున్న‌ట్లు ఎఫ్‌బీ వెల్ల‌డించింది. ఇందులో మిలిట‌రీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్త‌ల పేజీలు, క‌శ్మీర్ సంబంధిత పేజీలు కూడా ఉన్నాయి. అయితే పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంట‌ర్ స‌ర్వీస్ ప‌బ్లిక్ రిలేష‌న్స్‌(ఐఎస్‌పీఆర్‌) ఉద్యోగులు ఈ న‌కిలీ అకౌంట్ల‌ను న‌డిపిస్తున్న‌ట్లు ఎఫ్‌బీ విచార‌ణ‌లో తేలింది.