ఓట్ల కోసం మాత్రమే వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పండిః హరీష్ రావు

ఓట్ల కోసమే ప్రజల వద్దకు వస్తున్నవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రాష్ట్రమంత్రి హరీష్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ దుబ్బాక ఆర్య‌వైశ్య భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన అలాయ్ బ‌లాయ్ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు.

ఓట్ల కోసం మాత్రమే వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పండిః హరీష్ రావు
Balaraju Goud

|

Oct 26, 2020 | 3:54 PM

ఓట్ల కోసమే ప్రజల వద్దకు వస్తున్నవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రాష్ట్రమంత్రి హరీష్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ దుబ్బాక ఆర్య‌వైశ్య భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన అలాయ్ – బ‌లాయ్ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు కేవ‌లం ఓట్ల కోసం మాత్ర‌మే వ‌స్తున్నార‌ని తెలిపారు. ఉత్త‌మ్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దుబ్బాక‌కు ఒక్క‌సారి కూడా రాలేదు. కానీ, ఇప్పుడు ఓట్ల కోసం వ‌స్తున్నాడు. హుజుర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన త‌ర్వాత‌.. సీఎం కేసీఆర్ నేరుగా ఆ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి రూ. 300 కోట్ల ప‌నులు మంజూరు చేశార‌ని హ‌రీష్ రావు గుర్తు చేశారు.

దుబ్బాక అభివృద్ధి బాధ్య‌త త‌న‌దే అన్న హ‌రీష్.. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో నియోజకవర్గానికి అత్యధిక నిధులిచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. సీఎం ఆశీస్సుల‌తో నారాయ‌ణ‌ఖేడ్‌ను కూడా అభివృద్ధి చేశాన‌ని చెప్పారు. ఎన్నిక‌ల వ‌ర‌కే బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు దుబ్బాక‌లో ఉంటారు. కానీ తాను, సుజాత‌క్క ఎల్ల‌ప్పుడూ దుబ్బాక‌లోనే ఉండి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటామ‌న్నారు. దుబ్బాక‌లో ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌ను త‌ప్ప‌కుండా ఏర్పాటు చేస్తామ‌ని హ‌రీష్ రావు హామీనిచ్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu