Crime News: ఆత్మహత్య చేసుకున్న ఏడాదికి సూసైడ్ నోట్ దొరికింది.. భార్య వివాహేతర సంబంధమే కారణమంటూ..
Gujarat Suicide Note: గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి గతేడాది ఏప్రిల్‌లో నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే..
Gujarat Suicide Note: గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి గతేడాది ఏప్రిల్‌లో నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్యకు మాత్రం కారణం తెలియలేదు. అయితే ఇప్పుడు దాదాపు ఏడాదికి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ ఆ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి గతేడాది ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే తాజాగా అతని గదిని శుభ్రం చేస్తున్న సమయంలో మహేష్ తల్లికి సూసైడ్ నోట్ లభించింది. మహేష్ ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు ఆ లేఖను రాసినట్లు అందులో ఉంది. ఇక తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని. తాను ఎంత వద్దని వారించిన ఆ పనిమానలేదని పేర్కొన్నాడు. అంతేకాకుండా తనను నపుంసకుడిగా నిరూపించడానికి భార్య తన ముందే.. మరో వ్యక్తితో సాన్నిహితంగా గడిపిందని ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ లెటర్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భార్యతో పాటు, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.