AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేమ్‌ను క్యాష్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న ఇన్‌ప్లూయెన్సర్స్..

మురికిపట్టిన హాస్యానికి, పనికిమాలిన క్రియేటివిటీ కొంత జోడించి ఉన్నతమైన తండ్రీకూతుర్ల బంధాన్ని వికృతంగా చూపించిన ఒక సోకాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గుర్తున్నాడా? రెండేళ్ల కిందట లైమ్‌లైట్‌లోకొచ్చింది ఇతగాడి విపరీతబుద్ధి. ప్రతీ తండ్రీ వాడిమీద ఉమ్మేసి, బహిష్కరించినంత పనిచేశాడు. కనీసం అతడి పేరు పలకడానిక్కూడా వెగటు పుట్టేది అప్పట్లో మనందరికీ. నెటిజనం అంతా ఒక్కటై సోషల్ మీడియాలో ఇటువంటి పోకడల్ని ఖండఖండాలుగా నరికేసింది. వదిపెట్టం, ఇటువంటివాళ్లను వేటాడతాం ఏరివేస్తాం అని ప్రభుత్వాలు కూడా కంకణం కట్టుకున్నాయి. దురదృష్టం ఏంటంటే, అతగాడు ఇప్పటికీ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా చెలామణీ ఔతున్నాడు. కోర్టులు స్యుమోటో కేసులు రాస్తున్నయ్, బోనులోకి ఈడుస్తున్నయ్. కానీ, మన చట్టాలు సరిపోకనో, మరో కారణం చేతనో అటువంటి సోషల్ మీడియా సెలబ్రిటీల అతి మళ్లీమళ్లీ మితిమీరుతోంది. సైబర్ ఫ్రాడ్స్‌ని మించి జరుగుతోంది సెలబ్రిటీలు కాని ఈ సెలబ్రిటీల అరాచకత్వం. కొందరు వావీ వరసల్ని వదిలేస్తున్నారు. మరికొందరు పైసల కోసం కక్కుర్తి పడి, తమ ఫాలోయింగ్‌నే పెట్టుబడిగా చేసుకుని, కంత్రీ బిజినెస్ షురూ చేస్తున్నారు.

ఫేమ్‌ను క్యాష్ చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న ఇన్‌ప్లూయెన్సర్స్..
Influencer Scams
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2026 | 9:40 PM

Share

పెద్ద స్కామ్‌ని బైటపెట్టడం కాదు, పెద్ద స్కామ్‌కి సూత్రధారులు వీళ్లే అని లోకం కోడైకూస్తోంది. వారంపదిరోజులుగా అన్ని మీడియాల్లోకీ దూరి, హల్‌చల్ చేస్తున్న ఈ సోకాల్డ్ పాపులర్ ఫిగర్లు ఎంతోమంది.. చూడ్డానికి సో ఇన్నోసెంట్స్ అనిస్తారు. వారిది క్రేజీ ఫ్యామిలీ కాదు, ఖతర్నాక్ ఫ్యామిలీ అని ఆ తర్వాతే కదా తెలిసింది?.. నందూస్ వరల్డ్… ఇప్పుడు లండన్‌ టు ఏపీ ఇబ్రహీంపట్నం, తెలంగాణ మాదాపూర్‌ దాకా సెన్సేషన్ ఔతోంది. మూడేళ్ల కిందటే మన ఇండియన్సే టార్గెట్‌గా COS పేరుతో భారీ వీసా స్కామ్ చేసినట్లు వీళ్లమీద తీవ్రమైన ఆరోపణలు. రెండేళ్ల కిందట సీఐడీలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. తియ్యగా మాటలు చెప్పి, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికి, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం, ఫేక్ స్పాన్సర్‌షిప్‌లు కట్టబెట్టడం… ఇదీ నందూ స్కామ్ మోడస్ ఆపరాండీ. బాధితులు ఒక్కొక్కరుగా బైటికొచ్చి ఈ క్రేజీ కపుల్ పాల్పడే క్రేజీ స్కామ్‌ గురించి చెప్పుకుని గొల్లుమంటున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ అడ్డంగా దొరికిపోయిన దొంగలు. కేసులు, లుకౌట్‌ నోటీసుల దాకా చేరిపోయింది వ్యవహారం. ఇండియాతో పోలిస్తే, బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. నేరం రుజువైతే యూకేలో ఉన్నపళంగా పాస్‌పోర్ట్‌లు రద్దైపోతాయ్. కనీసం పదేళ్ల జైలుశిక్ష పక్కా అని అక్కడున్న సొలిసిటర్లు చెబుతున్నారు. పదేళ్ల కారాగారం పూర్తయ్యి, అక్కడినుంచి విడుదలైన తర్వాతనే ఇండియాకు డిపోర్ట్ చేస్తారు. అప్పుడు మొదలౌతుంది మన పోలీసుల కోటింగ్. బైటి ప్రపంచంలో ఇంత జరుగుతున్నా,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన
తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది
పిల్లలే కాదు,పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతది
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు..!
Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!
Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త..!
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశాడు.. 6 నెలల్లో ఎంత సంపాదించాడంటే
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
7 రికార్డులపై కన్నేసిన కింగ్.. ప్రమాదంలో సచిన్ అరుదైన హిస్టరీ..!
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
తనను కాటేసిందని కోపంతో పామునే కొరికేసిన యువకుడు
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. తొలి పేరు షాకింగే