ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో సాయి పల్లవి  ప్లేస్‌లోకి క్రేజీ హీరోయిన్ 

08 June 2026

Pic credit - Instagram

Rajeev 

సంగీత మహారాణి, భారతరత్న ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి గారి బయోపిక్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అనేది ఒక అద్భుతమైన మరియు సవాలుతో కూడిన ప్రాజెక్ట్.

'జెర్సీ' సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కాగా ఈ సినిమాలో ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. 

ప్రస్తుతం సాయి పల్లవి వరుసగా సినిమాల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ నుంచి సాయి పల్లవి తప్పుకుందని తెలుస్తుంది. 

కాగా ఇప్పుడు సాయి పల్లవి ప్లేస్ లోకి రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా జరిగిందని టాక్.