Thief Escape: బైక్ దొంగిలించాడు.. పోలీసులకు చిక్కినట్లే చిక్కి పారిపోయాడు.. వారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు..

Thief Escape: హైదరాబాద్‌లో ఓ దొంగ బైక్‌ను దొంగిలించాడు. అంతలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే వారిక ఏమరపాటు..

Thief Escape: బైక్ దొంగిలించాడు.. పోలీసులకు చిక్కినట్లే చిక్కి పారిపోయాడు.. వారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 3:36 PM

Thief Escape: హైదరాబాద్‌లో ఓ దొంగ బైక్‌ను దొంగిలించాడు. అంతలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే వారి ఏమరపాటు కారణంగా క్షణాల్లోనే పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. కానీ స్థానికుల చేతికి చిక్కాడు. దాంతో వారు ఆ దొంగకు గట్టి సన్మానం చేసి తిరిగి పోలీసులకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గాంధీభవన్ పక్కన ఉన్న పటేల్ నగర్‌లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

అయితే అటువైపుగా దొంగిలించిన బైక్‌తో ఓ వ్యక్తి వచ్చాడు. పోలీసులు అది దొంగిలించిన బైక్‌గా గుర్తించి అతన్ని పట్టుకున్నారు. అంతలోనే పోలీసుల కళ్లుగప్పి వారి చేతిలో నుంచి ఆ దొంగ పారిపోయాడు. అయితే.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ దొంగను పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దాంతో ఆ దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేశారు.

Also read:

Telangana Police: తెలంగాణ పోలీసులకు అది ఫ్యాషన్ అయిపోయింది.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు..

ED arrests MP KD Singh : మనీలాండరింగ్ కేసులో మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కేడీ సింగ్‌ అరెస్టు