Telangana Police: తెలంగాణ రాష్ట్ర పోలీసుల తీరుపై బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Police: తెలంగాణ రాష్ట్ర పోలీసుల తీరుపై బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మెదక్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులపై దాడులు చేయడం పోలీసులకు ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు.
ఖాకీ యూనిఫాం విలువ తీయవద్దని మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే రఘునందన్ సూచించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని అనుకుంటే ఖాకీ యూనిఫాం ను పక్కనబెట్టి మహేందర్ రెడ్డి నేరుగా టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని వ్యాఖ్యానించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు. జనగామ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడ్డుకోవవడం దారుణం అన్నారు.
Also read:
Man died with Manja : ప్రాణం తీసిన మాంజా దారం.. బైక్ వస్తుండగా గొంతు తెగి యువకుడి మృతి
రాచకొండ పోలీసుల అదుపులో లోన్ యాప్ కేటుగాళ్లు.. పట్టుబడినవారిలో ఓ చైనా జాతీయుడు