AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో తన ఆటతోనే కాకుండా, మైదానం వెలుపల తన స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అత్యంత విలాసవంతమైన జీవనశైలిని గడిపే హార్దిక్, ధరించే ప్రతి వస్తువు కూడా ఖరీదైనదే. కోట్లు విలువ చేసే వాచీలు, అరుదైన బ్రాస్‌లెట్లు, ఖరీదైన దుస్తులతో ఆయన తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. అయితే, వీటన్నింటిలోనూ ఆయన మెడలో ఎప్పుడూ మెరిసే ఒక సిల్వర్ రంగు చెయిన్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది.

గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే
Cricketer Hardik Pandya
Nikhil
|

Updated on: Jun 08, 2026 | 10:31 PM

Share

క్రికెటర్​ హార్ధిక్​ పాండ్య ధరించే చెయిన్​ చూడడానికి సాధారణ సిల్వర్ చెయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది వెండితో చేసినది కాదు. ఇది అత్యంత విలువైన ‘వైట్ గోల్డ్’తో తయారు చేయబడింది. దీనికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, అత్యంత అరుదైన ‘వీవీఎస్’ (VVS) డైమండ్లను పొదిగారు. ఈ లగ్జరీ చెయిన్ విలువ సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చెయిన్ కు ఉన్న క్రేజ్ ఎంతంటే, మార్కెట్‌లో ‘హార్దిక్ పాండ్యా స్టైల్’ పేరుతో సిల్వర్ చెయిన్లు కూడా భారీగా అమ్ముడవుతున్నాయి.

సెంటిమెంట్, స్టైల్

హార్దిక్ పాండ్యాకు ఈ వైట్ గోల్డ్ మెటల్ చెయిన్ అంటే చాలా సెంటిమెంట్ అని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తుంటాయి. తన తండ్రి హిమాన్షు పాండ్యా, హార్దిక్ మరియు కృనాల్ పాండ్యా ఇద్దరికీ ఈ చెయిన్లను బహుమతిగా ఇచ్చారని, అందుకే ఆయన దీనిని ఎప్పుడూ ప్రాణప్రదంగా ధరిస్తారని టాక్. అయితే, ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా ఎప్పుడూ బహిరంగంగా ధృవీకరించలేదు. ఏది ఏమైనా, ఆయన విలాసవంతమైన ఫ్యాషన్ ఎంపికలలో ఈ చెయిన్ ఒక ఐకానిక్ వస్తువుగా నిలిచింది. దీనిని మెడలో చెయిన్‌గానే కాకుండా, చేతికి బ్రాస్‌లెట్‌గా కూడా ధరించవచ్చు.

స్టైల్ ఐకాన్ హార్దిక్

ప్లాటినం బ్రాస్‌లెట్లు, కోట్ల విలువైన వాచీలతో కూడిన హార్దిక్ పాండ్యా వార్డ్‌రోబ్, ఆయన ఫ్యాషన్ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి తన ఆశయాలను ఎలా నెరవేర్చుకుంటారో చెప్పడానికి హార్దిక్ జీవనశైలే ఒక నిదర్శనం. ఆటకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ శైలిని సృష్టించుకోవడం హార్దిక్ పాండ్యాకే చెల్లింది. ఆయన ధరించే ప్రతి యాక్సెసరీ కూడా అభిమానులకు ఒక ఫ్యాషన్ గోల్‌గా మారుతోంది. ఆ ఆటగాడి విలాసవంతమైన ప్రపంచం ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది.

Follow Us