బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలా?

28 June 2026

TV9 Telugu

TV9 Telugu

కొంతమంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో అన్నం పూర్తిగా మానేస్తుంటారు. అయితే తరతరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్న బియ్యానికి భయపడాల్సిన అవసరం లేదట

TV9 Telugu

నిజానికి బి-విటమిన్లు (థయామిన్‌, నియాసిన్‌, విటమిన్ బి6), మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం వంటి ఖనిజాలతోపాటు కార్బోహైడ్రేట్లు కూడా బియ్యంలో సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

బియ్యంలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌) నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీంతో శరీరానికి శక్తి క్రమంగా విడుదల అవుతుంది

TV9 Telugu

శుద్ధి చేసిన చక్కెరలు అధికంగా ఉండే ఆహారాల మాదిరిగా ఒక్కసారిగా శక్తి పెరిగి వెంటనే తగ్గిపోవడం (ఎనర్జీ క్రాష్‌) జరగకుండా రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది

TV9 Telugu

అలాగే ఏకాగ్రతను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. గ్లూటెన్‌కు అలెర్జీ లేదా సున్నితత్వం ఉన్నవారికి బియ్యం మంచి ప్రత్యామ్నాయం

TV9 Telugu

గోధుమ, బార్లీ, రై వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్‌ కొందరిలో జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తుంది. అయితే బియ్యంలో సహజంగానే గ్లూటెన్‌ ఉండదు

TV9 Telugu

అందువల్ల గ్లూటెన్‌-రహిత ఆహారం తీసుకోవాల్సిన వారు కూడా బియ్యంతో తయారయ్యే అనేక రకాల వంటకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదించవచ్చు

TV9 Telugu

అన్నం పరిమిత మోతాదులో తీసుకుని అందులో పప్పులు, కూరగాయలు, ప్రోటీన్‌ పదార్థాలు కలిపి సమతుల్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు