AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండ నుంచి కారేది నీరు కాదు, బంగారం కంటే విలువైన సంపద..పురుషుల పాలిట వరం!

సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన వీడియో వైరల్ అవుతోంది. హిమాలయాల ఎత్తైన శిఖరాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ పర్వతంలోని ఒక పగులు నుండి కారుతున్న నల్లటి, జిగట ద్రవాన్ని చూపించి, దానికి పర్వత చెమట అని పేరు పెట్టారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. పర్వతాల నుండి కారుతున్న ఈ నల్లటి ద్రవం నిజంగా పర్వత చెమటేనా? ఇది ఎందుకు బంగారం కంటే ఖరీదు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

కొండ నుంచి కారేది నీరు కాదు, బంగారం కంటే విలువైన సంపద..పురుషుల పాలిట వరం!
Mountain Sweat
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2026 | 12:59 PM

Share

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ గనులలో హిమాలయ పర్వతాలు ఒకటి. ఈ పర్వతాల గుండెల్లో నుండి లభించే అత్యంత అరుదైన, శక్తివంతమైన ఆయుర్వేద పదార్థమే శిలాజిత్ (Shilajit). సోషల్ మీడియాలో, ఆయుర్వేద ప్రపంచంలో దీనిని తరచూ పహాడో కా పసీనా అంటే పర్వతాల చెమట అని పిలుస్తుంటారు. శిలాజిత్ అనేది హిమాలయాలు, అలకనంద నది, ఇతర ఎత్తైన పర్వతాలలోని రాళ్ల నుండి ఊరుతూ లభించే ఒక సహజ పదార్థం. ఇది వేల సంవత్సరాల నాటి మూలికలు, ఖనిజాలు, సేంద్రీయ పదార్థాల సమాహారమని నమ్ముతారు.

శిలాజిత్ ఎలా ఏర్పడుతుంది?:

వేసవిలో పర్వతాలు కరిగినప్పుడు, ఈ నల్లని, జిగటగా ఉండే, మెరిసే ద్రవం బయటకు ఊరుతుంది. ప్రజలు దీనిని పర్వతాల చెమట లేదా పర్వతాల ఐ-లైనర్ అని కూడా పిలుస్తారు. వేసవి కాలంలో హిమాలయాల్లోని ఎండ వేడికి రాళ్ల సందుల నుండి నల్లటి జిగురు లాంటి పదార్థం నెమ్మదిగా బయటకు స్రవిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కేవలం ఒక సాధారణ జిగురు కాదు.. పురుషుల పాలిట ఒక సంజీవని లాంటిది. వందల సంవత్సరాల క్రితం నాటి దట్టమైన వృక్షాలు, మొక్కలు, విలువైన ఖనిజాలు కొండల పొరల మధ్య నలిగిపోయి, సూక్ష్మజీవుల చర్యల వల్ల నెమ్మదిగా కుళ్ళిపోతాయి. ఈ సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఏర్పడే పవిత్రమైన రసాయనమే శిలాజిత్. దీనిని సేకరించడం ఎంతో కష్టతరమైన పని కాబట్టి, మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పురుషుల శారీరక, లైంగిక సామర్థ్యం పెంపు:

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శిలాజిత్ పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్ స్థాయిలను సహజంగా పెంచుతుంది. తద్వారా శారీరక బలహీనత, అలసట తగ్గి, లైంగిక సామర్థ్యం, ఉత్సాహం గణనీయంగా పెరుగుతాయి.

శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ (ఫుల్విక్ యాసిడ్):

శిలాజిత్‌లో ఫుల్విక్ యాసిడ్ (Fulvic Acid), దాదాపు 84 రకాలకు పైగా ఖనిజాలు (Minerals) ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి, మెదడు సంరక్షణ:

ఇది శరీరంలో ఇమ్యూనిటీని (రోగనిరోధక శక్తిని) అద్భుతంగా పెంచుతుంది. అలాగే, మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధుల ముప్పును తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Shyam Times (@theshyamtimes)

శిలాజిత్ ఎంత శక్తివంతమైనదో, దానిని సరైన పద్ధతిలో వాడటం అంతే ముఖ్యం. మార్కెట్లో దొరికే నకిలీ శిలాజిత్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ శుద్ధి చేసిన (Purified) ఒరిజినల్ శిలాజిత్‌ను మాత్రమే వైద్యుల లేదా ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు తగిన మోతాదులో సాధారణంగా పాలలో కలిపి తీసుకోవాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us