టీ, కాఫీ మంచివేనా..? తాగడం మానేయాలా..?

08 June 2026

TV9 Telugu

TV9 Telugu

కాఫీ, టీ లేనిదే రోజు మొదలవదు... ఉత్సాహంగా పని చేయలేం.. ఈ మాటలు మన చుట్టూ ఎవరో ఒకరి నుంచి వింటూనే ఉంటాం. వీటిలో ఉండే కెఫీన్‌ తక్షణ శక్తిని ఇస్తుంది

TV9 Telugu

కానీ రోజులో ఎక్కువసార్లు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని సహజ శక్తి స్థాయులపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు న్యూట్రిషనిస్టులు

TV9 Telugu

టీ, కాఫీలు కేవలం పానీయాలు కాదు, చాలామందికి ఇవో అవసరంగా మారాయి. ఇవి లేకుండా కొందరికి రోజు మొదలవ్వదు. మరి టీ, కాఫీలు మంచి చేస్తాయా, చెడుకు దారి తీస్తాయా?

TV9 Telugu

టీ, కాఫీలలో ఉండే కెఫీన్‌ హృదయ స్పందన వేగాన్ని, రక్తపోటును పెంచుతుందని ఇప్పటివరకూ అధ్యయనాలు చెబుతూ వచ్చాయి. అయితే 2026లో వచ్చిన ఓ అధ్యయనం షాకింగ్‌ విషయాలు వెల్లడించింది

TV9 Telugu

కెఫీన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, వాపు నివారణ లక్షణాలు రక్తనాళాల పనితీరుని మెరుగు పరుస్తాయని చెబుతోంది. రోజులో 2-3 కప్పుల టీ/కాఫీ అంటే 200-300 మి.గ్రా. కెఫీన్‌ మంచిదేనట

TV9 Telugu

ఇది గుండె జబ్బుల్నీ, మధుమేహాన్నీ దూరం చేస్తుందట. దీనికి కారణం కాఫీలో ఉండే క్లోరోజనిక్‌ యాసిడ్స్, టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌. ఇవి జీవక్రియను పెంచి, వాపుని తగ్గిస్తాయి

TV9 Telugu

కానీ అంతకంటే ఎక్కువ పరిమాణంలో వీటిని తీసుకుంటే రక్తపోటుకు దారి తీస్తుంది. మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా గుండె మీద భిన్నరకాలుగా ప్రభావం ఉంటుంది

TV9 Telugu

కాబట్టి వీళ్లు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. పూర్తిగా మానేయడం కాకుండా, పరిమితంగా తీసుకోవడం మంచిది. గ్రీన్, బ్లాక్‌ టీలలో ఇంకా మంచిది. ఇందులోని పాలీఫినాల్స్‌ చెడ్డ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి