త్వరలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’

వైట్ కార్డు ద్వారా రేషన్ పొందుతున్నవారందరికి గుడ్ న్యూస్. ఇకపై మీరు దేశంలో ఎక్కడున్నా..కార్డు దగ్గరుంటే చాలు..రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఈ విప్లవాత్మక విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ తెలిపారు. ఈ మేరకు ఆహార భద్రతపై ఫుడ్‌ కార్పొరేషన్‌, కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు, వివిధ రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో […]

త్వరలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’
Follow us

|

Updated on: Jun 28, 2019 | 8:11 PM

వైట్ కార్డు ద్వారా రేషన్ పొందుతున్నవారందరికి గుడ్ న్యూస్. ఇకపై మీరు దేశంలో ఎక్కడున్నా..కార్డు దగ్గరుంటే చాలు..రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఈ విప్లవాత్మక విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ తెలిపారు. ఈ మేరకు ఆహార భద్రతపై ఫుడ్‌ కార్పొరేషన్‌, కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు, వివిధ రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు.

‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలివెళ్లే వలసదారులు దేశంలో తమకు నచ్చిన కిరాణా దుకాణం నుంచి సరకులు తీసుకొనే వెసులుబాటు కలగనుంది.  దీనివల్ల కూలి పనులు చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు కూడా ఆహార భద్రతను యథావిధిగా పొందుతారని పాసవాన్‌ అన్నారు.

ఇప్పటికే ఏపీ, తెలంగాణ, గుజరాత్‌, హర్యాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ పీడీఎస్‌ వ్యవస్థ అమలులో ఉంది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని లబ్ధిదారులు ఏ జిల్లాలోనైనా సరకులు పొందొచ్చు.  ఇదే తరహాలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు’ విధానాన్ని రాబోయే రెండు నెలల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  దశలవారీగా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నారు.