2-17 ఏళ్ళ మధ్య వయస్సువారిపై కోవోవాక్స్ ట్రయల్ కి నో…అనుమతిని నిరాకరించిన నిపుణుల కమిటీ…
2 నుంచి 17 ఏళ్ళ మధ్య వయస్సువారిపై సీరం కంపెనీ నిర్వహించదలిచిన రెండు, మూడు త్రయాల్స కి ప్రభుత్వ నిపుణుల కమిటీ అనుమతిని నిరాకరించింది.
2 నుంచి 17 ఏళ్ళ మధ్య వయస్సువారిపై సీరం కంపెనీ నిర్వహించదలిచిన రెండు, మూడు త్రయాల్స కి ప్రభుత్వ నిపుణుల కమిటీ అనుమతిని నిరాకరించింది. మొత్తం 920 మంది పిల్లలపై ట్రయల్ నిర్వహించేందుకు అనుమతి కోసం ఈ సంస్థ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు పెట్టుకుంది. 12 నుంచి 17 ఏళ్ళ మధ్య గలవారిలో 460 మంది పైన.. 2 నుంచి 11 ఏళ్ళ మధ్య వయస్సు గల వారిలో కూడా మరో 460 మందిపైన ట్రయల్స్ నిర్వహించాలన్నది దీని ఉద్దేశం.. ఇందుకు 10 కేంద్రాలను కూడా సెలెక్ట్ చేసింది. ఈ దరఖాస్తుపై చర్చించిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ..ఏ దేశంలోనూ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగానికి ఇంకా అనుమతి లభించలేదని పేర్కొంది.ప్రస్తుతం పెద్దలపై జరుపుతున్న కోవోవాక్స్ ట్రయల్స్ ఎంతవరకు సేఫ్టీ తదితర వివరాలకు సంబంధించైనా డేటాను సమర్పించాలని ఈ కమిటీ కోరింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లోని ఈ కమిటీ చేసిన సిఫారసులను డీసిజీఐ ఆమోదించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఇంకా పెద్దవారిపై ఈ వ్యాక్సిన్ ట్రయల్ నిర్వహిస్తున్నారు. దీని డేటా ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి కోవావాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని సీరం కంపెనీ ఎప్పుడో ప్రారంభించింది. ఈ నెలలో పిల్లలపై దీని ట్రయల్ ను నిర్వహించాలని కూడా ప్రతిపాదించింది. కానీ ఈ ట్రయల్ కి అనుమతి లభించలేదు. అయితే త్వరలో పర్మిషన్ లభించగలదని ఆశిస్తున్నట్టు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకునే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అయితే ఆయా దేశాల్లో కోవోవాక్స్ ట్రయల్స్ పిల్లలమీద ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి
గుజరాత్ లో ఆప్ నేతలపై దాడి.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన.. బీజేపీపై ఆరోపణ