ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నైసూపర్ కింగ్స్ సారథి ఎం.ఎస్.ధోనీ అభిమానులకు సీఎస్కే మేనేజ్‌మెంటు శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఐపీఎల్‌లో పేలవమైన ప్రదర్శనతో విసిగిస్తున్న ధోనీపై విరుచుకుపడుతున్న నెటిజెన్ల నోళ్ళు మూయించేందుకు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక ప్రకటన చేశారు.

ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన
Rajesh Sharma

|

Oct 27, 2020 | 2:56 PM

Good news for dhoni fans CSK management: తాను పెద్దగా సక్సెస్ కాకపోవడమే కాకుండా.. మొత్తం జట్టు పేలవమైన ప్రదర్శనకు కారణమైన ఎం.ఎస్.ధోనీనే వచ్చే ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తాడంటూ మిస్టర్ కూల్ అభిమానులకు గుడ్ న్యూస్ వెల్లడించింది సీఎస్కే మేనేజ్‌మెంటు. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్వయంగా ధోనీ అభిమానులకు శుభవార్త వెల్లడించాడు. ఆటలన్నాక గెలుపోటములు సహజమని అంత మాత్రాన ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడం వుండదని ఆయన తెలిపారు. మూడు సార్లు జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపిన ఘనత ధోనీకి వుందని, అంతే గాక సీఎస్కేను మరో అయిదు సార్లు ఫైనల్‌కు చేర్చాడని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం యూఏఈలోని మూడు వేదికల్లో ఐపీఎల్ 2020 టోర్నమెంటు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, టోర్నమెంటు ప్రారంభానికి ముందు నుంచి సీఎస్కేకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన ప్రస్తావన వచ్చిన తొలి రోజుల్లోనే చెన్నై టీమ్ సభ్యులు పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత టోర్నీ ప్రారంభం కానున్న తరుణంలో కీలక ఆటగాళ్ళు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌ను ముంబయిపై గెలవడం ద్వారా ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తర్వాత వరుస ఓటములతో టోర్నీ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.

ప్రస్తుత సీజన్‌లో తాను పెద్దగా సక్సెస్ కాకుండా.. జట్టును కనీసం ప్లే ఆఫ్‌ దశకు చేర్చకుండా కెప్టెన్‌గాను విఫలమైన ధోనీపై పలువురు క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంటు ప్రకటించిన ధోనీ.. ఐపీఎల్ టోర్నీలోను నిరాసక్తతో ఆడాడంటూ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు.. అసలు ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంటు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2021 ఐపీఎల్ టోర్నీలోను సీఎస్కే టీమ్‌కు ధోనీనే సారథ్యం వహిస్తాడంటూ జట్టు మేనేజ్‌మెంటు ప్రకటించింది.

ఇదిలా వుండగా.. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంటు నవంబర్ పదో తేదీన ముగియనున్నది. 2021 ఐపీఎల్ టోర్నీ షెడ్యూటు ప్రకారమే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరో 2,3 నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలుండడంతో నెక్స్ట్ ఐపీఎల్ ఇండియాలో.. షెడ్యూలు ప్రకారం అంటే ఏప్రిల్, 2021లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అంటే 5 నెలల గ్యాప్‌లో మళ్ళీ ఐపీఎల్ వుంటుంది. ఈలోగా సమర్థుడైన కెప్టెన్‌ను.. అదీ ధోనీ స్థాయి కెప్టెన్‌ను ఎంపిక చేసుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. దాంతో నెక్స్ట్ సీజన్‌కు ధోనీనే కెప్టెన్‌గా కొనసాగించి… 2022 ఐపీఎల్ నాటికి కొత్త కెప్టెన్‌ను సీఎస్కే మేనేజ్‌మెంటు ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయి.

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu