AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mines In AP: ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలకు రెడీ అవుతున్న ఓ ప్రైవేట్ సంస్థ

Gold Mines In AP: ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్. ఇక్కడ ఉన్న బంగారు గనుల తవ్వకానికి ఓ ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ రెడీ అయ్యింది. కర్నూలు జిల్లాలోని..

Gold Mines In AP: ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలకు రెడీ అవుతున్న ఓ ప్రైవేట్ సంస్థ
Gold Mines In Ap
Surya Kala
|

Updated on: Jun 08, 2021 | 12:42 PM

Share

Gold Mines In AP: ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్. ఇక్కడ ఉన్న బంగారు గనుల తవ్వకానికి ఓ ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ రెడీ అయ్యింది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు ఇండో ఆస్ట్రేలియన్ అనే సంస్థ సిద్ధం అవుతుంది జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించి.. పూర్తి స్థాయిలో ఆస్ట్రేలియన్ ఇండియన్ రిసోర్స్ లిమిటెడ్ సంస్థ.. పరిశోధన సాగించింది. బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించిన ఈ సంస్థ 2005లోనే ఈప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ ప్రాజెక్టుకోసం 1500 ఎకరాలు అవసరం ఉండగా.. ఇందులో 350 ఎకరాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. మరో 1150 ఎకరాలను లీజు క్రింద కంపెనీ తీసుకోనుంది. మైనింగ్ లీజులు, పర్యావరణ అనుమతుల కోసం తీవ్రమైన జాప్యం చేసుకోవటంతో ప్రాజెక్టు అనుమతులు ఆలస్యమయ్యాయి.

ఈ తొలిబ్లాక్‌లో ముందుగా బంగారు గనుల తవ్వకం ప్రారంభించనుంది. అనంతరం మరో మూడు బ్లాక్ ల్లో మైనింగ్ చేయాలని ఈ సంస్థ నిర్ణయించింది. ప్రతిఏటా 750 కేజీల బంగారం తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ఈ నాలుగు బ్లాకులు కలిపి సుమారుగా 30 నుండి 40 టన్నుల బంగారు నిక్షేపాలను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పూర్తిస్ధాయిలో అనుమానులు లభించడంతో త్వరలో బంగారు గనుల తవ్వకాలను చేపట్టేందుకు ఆస్ట్రేలియన్ ఇండియన్ రిసోర్స్ లిమిటెడ్ రెడీ అవుతుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ గత ఏడాదిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కారణంగా అనుమతులు రావడం ఆలస్యమైంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అనుమతులు లభ్యంకావడంతో బంగారం తవ్వకాలను అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. వచ్చే ఏడాది అంటే 2022 ఏప్రిల్ తరువాత బంగారు గనుల తవ్వకం చేపట్టేందుకు AIRL సంస్ధ సిద్ధమౌతుంది.

నిజానికి కర్నూలు జిల్లాలో జొన్నాడ తో సహా కొన్ని గ్రామాల పేర్లు దేశ వ్యాప్తంగా వినిపిస్తూనే ఉంటారు. తొలకరి చినుకులు పడే సమేహంలో ఇక్కడ వజ్రాలు లభ్యమవుతూ.. వార్తల్లో నిలుస్తాయి. అక్కడ పొలాల్లో స్ధానికులకు వజ్రాలు లభిస్తుండటం వాటి విలువ కోట్లల్లో పలుకుతుండటంతో జొన్నగిరి ప్రాంతం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇప్పుడు ఏకంగా బంగారం లభ్యమవుతుంది.. త్వరలో తవ్వకాలు చేపట్టనున్నారు అనే వార్తలతో మరోసారి దేశ వ్యాప్తంగా జొన్నాడ గ్రామం పేరు మార్మోగిపోనుంది.

Also Read: అన్న చేసిన తప్పుని నిలదీసిన తమ్ముడు.. దేవతను ఇంట్లోనుంచి పంపించేసి ఇంట్లో దెయ్యాలా తిరుగుదామా అంటూ..