మక్కతోట మంచెపై ఆన్‌లైన్ క్లాసులు..
చుట్టూ పచ్చని మొక్క జొన్న తోట.. మధ్యలో మంచె.. దానిపై స్కూల్ యూనిఫామ్‌లో విద్యార్థిని చేతిలో ఫోన్ పట్టుకుని టీచర్ చెప్పే ఆన్లైన్ క్లాసులను శ్రద్దగా వింటోంది.

Online Classes In Remote Villages: చుట్టూ పచ్చని మొక్క జొన్న తోట.. మధ్యలో మంచె.. దానిపై స్కూల్ యూనిఫామ్‌లో విద్యార్థిని చేతిలో ఫోన్ పట్టుకుని టీచర్ చెప్పే ఆన్లైన్ క్లాసులను శ్రద్దగా వింటోంది. ఇక ఈ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా స్కూళ్లను ఇప్పట్లో తెరిచే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను బోధిస్తున్నాయి. పట్టణాల్లో అయితే మొబైల్ టవర్లు ఉంటాయి కాబట్టి సిగ్నల్స్ ఉంటాయి.
కానీ పల్లెల్లో అలా కాదు.. చెట్లు, కొండగుట్టలు ఎక్కాల్సి వస్తుంది. ఇక ఈ అమ్మాయి తన పొలంలో ఉన్న మంచె ఎక్కితే సిగ్నల్ బాగా వస్తుందని.. రోజూ తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంగా ఉన్న మొక్కజొన్న తోటకు తన తండ్రితో కలిసి వెళ్లి అక్కడ ఉన్న మంచెపై కూర్చొని శ్రద్దగా ఆన్లైన్ క్లాసులు వింటోంది.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో నివసిస్తున్న సాఫా జరీనా అనే విద్యార్థిని మైనారిటీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తన ఇంటి దగ్గర సరైన సిగ్నల్స్ లేకపోవడంతో.. ప్రతీ రోజూ ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఊరు చివరన ఉన్న మొక్కజొన్న తోటలో మంచెపైన కూర్చొని ఆన్లైన్ పాఠాలు వింటూ శ్రద్దగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటోంది. కాగా, దీనికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..




