అందుకే ఏపీ నెంబర్ వన్ అయింది
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రీయల్ పార్క్‌ల్లో వాణిజ్యవేత్తలతో దీనికి సంబంధించి..
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రీయల్ పార్క్‌ల్లో వాణిజ్యవేత్తలతో దీనికి సంబంధించి పలుమార్లు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించిందన్నారు. కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు ఏపీ ప్రభుత్వం తోడ్పాటునిచ్చిందని పేర్కొన్నారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని చెప్పారు. పెట్టుబడిదారులుకు ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకునే ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ వన్ ర్యాంకు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్ సౌకర్యం ఉందని మంత్రి తెలిపారు. విజయవాడ, విశాఖలో వాణిజ్య వివాదాలకు ప్రత్యేక న్యాయస్థానం, ఔషధాల విక్రయ లైసెన్స్ ఆన్‌లైన్‌లోనే పొందే సౌకర్యం ఉందన్నారు. ఏటా రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా షాపులకు మినహాయింపు ఇస్తున్నామని, కార్మిక చట్టాల కింద సింగిల్ ఇంటిగ్రేటెడ్ రిటర్న్స్ దాఖలుకు పెద్దపీట వేసినట్లు మంత్రి మేకపాటి చెప్పారు.