హీరోగా ఆఫర్స్ అందుకుంటున్న రియల్ హీరో.. న్యూ ఇన్నింగ్స్, న్యూ పిచ్ చాలా సరదాగా ఉందంటున్న సోనూసూద్
ఇన్నిరోజులు సినిమాల్లో చేసింది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో సొంతగ్రామాలకు వెళ్ళేలేని వలస కార్మికుల పాలిట దైవం అయ్యాడు సోనూసూద్.

ఇన్నిరోజులు సినిమాల్లో చేసింది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో సొంతగ్రామాలకు వెళ్ళేలేని వలస కార్మికుల పాలిట దైవం అయ్యాడు సోనూసూద్. వేలమందిని తమ స్వగ్రామాలకు పంపాడు. బస్సులు, రైళ్లు, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఎంతోమందిని ఆదుకున్నాడు. అంతటితో ఆగిపోకుండా కష్టం చెప్పుకున్న ప్రతిఒక్కరికి తనవంతు సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాడు సోనూ.
సోనూసుద్ చేస్తున్న సేవలకు దేశం మొత్తం ప్రసంశలు కురిపించింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనను వరించాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ తన వ్యక్తిగత అదేవిధంగా వృత్తి పరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నిరోజులు విలన్ గా పాత్రలు వచ్చాయి… ఇప్పుడు హీరో పాత్రలు కూడా వస్తున్నాయని అన్నారు. నాలుగు-ఐదు అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా వచ్చినట్లు సోనూసూద్ చెప్పారు. ఇది సరికొత్త ఆరంభం అన్నారు. న్యూ ఇన్నింగ్స్, న్యూ పిచ్ చాలా సరదాగా ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ‘ఆచార్య’ సినిమాలో తాను నటించిన సన్నివేశాలను తిరిగి షూట్ చేస్తున్నట్టు చెప్పారు. మూవీ మేకర్స్ తన కొత్త ఇమేజ్ ప్రకారం స్క్రిప్ట్ మార్చారన్నారని తెలిపాడు. అందువల్ల రీషూట్ చెయ్యవలసి వచ్చిందన్నారు సోనూసూద్.




