మరో కొత్త వ్యాధి వచ్చేస్తోంది.. కేరళలో 20 మందికి షిగెల్లా వ్యాధి లక్షణాలు.. 11 ఏళ్ల బాలుడు మృతి.

తాజాగా కేరళలో మరో కొత్త వ్యాధి పుట్టుకొచ్చింది. కొజికోడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఇప్పటి వరకు వైద్యులు 20 మందిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. ‘షిగెల్లా’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా 11 ఏళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలవరపెడుతోంది.

మరో కొత్త వ్యాధి వచ్చేస్తోంది.. కేరళలో 20 మందికి షిగెల్లా వ్యాధి లక్షణాలు.. 11 ఏళ్ల బాలుడు మృతి.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2020 | 6:09 PM

shigella infection in kerala: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే కేసుల పెరుగుదల సంఖ్య తగ్గుతోన్నా.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే మన దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది కేరళలో అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా కేరళలో మరో కొత్త వ్యాధి పుట్టుకొచ్చింది. కొజికోడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఇప్పటి వరకు 20 మందిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ‘షిగెల్లా’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా  11 ఏళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలవరపెడుతోంది. ఇక ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే.. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట. కలుషిత నీరు, పాడైపోయిన ఆహారం తీసుకోవడం ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని వైద్యులు చెబుతున్నారు. షిగెల్లా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తి  వ్యాధి చాలా సులభంగా సోకే అవకాశాలున్నాయి. వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇప్పటి వరకు కరోనాతో పోరాడుతోన్న కేరళ ప్రభుత్వం ఇప్పుడీ కొత్త వ్యాధిపై యుద్ధం ప్రకటించింది. స్థానిక బావుల్లో, నీటి కొళాయిల్లో క్లోరినేషన్ ​చేస్తున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.