AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: ఈ ఐదు పనులూ చేస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతోంది గరుడ పురాణం..అవి ఏమిటంటే..

Garuda Puranam: మీరు గరుడపురాణం పేరు వినే ఉంటారు. సాధారణంగా దీనిని ఎవరైనా మరణించినపుడు పారాయణం చేస్తారు. ఈ పురాణంలోనే ప్రజలకు స్వర్గం, నరకం గురించి చెబుతారు.

Garuda Puranam: ఈ ఐదు పనులూ చేస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతోంది గరుడ పురాణం..అవి ఏమిటంటే..
Garuda Puranam
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 17, 2021 | 6:35 PM

Share

Garuda Puranam: మీరు గరుడపురాణం పేరు వినే ఉంటారు. సాధారణంగా దీనిని ఎవరైనా మరణించినపుడు పారాయణం చేస్తారు. ఈ పురాణంలోనే ప్రజలకు స్వర్గం, నరకం గురించి చెబుతారు. మరణం తరువాత ఒక వ్యక్తి తన పనుల ఆధారంగా పొందే అన్ని ఆనందాలు,బాధలను ఈ పురాణం ప్రస్తావిస్తుంది. అంతే కాకుండా ఒక మనిషి జీవితంలో ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలనే విషయాన్నీ ఈ పురాణం చెబుతుంది. గరుడ పురాణం విని అర్ధం చేసుకున్న వారు కచ్చితంగా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు.

అంతే కాకుండా గరుడపురాణం ఒక వ్యక్తి తన కర్మను సరిదిద్దకునే మార్గం చూపిస్తుంది. ఈ పురాణంలో ఇటువంటి విధానాలు, జీవన నియమాలు స్పష్టం చేశారు. దీనిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన కష్టాలన్నిటినీ అధిగమించగలడు. ఈ పురాణం విష్ణువు పై భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని చదివి దాని నుండి నేర్చుకొని వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇది మనల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. అలాగే, మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.

1. ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపర్చడానికి ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదని గరుడ పురాణంలో చెప్పారు. ఈ ఉపవాసం పూర్తి భక్తి, శ్రద్ధతో చేస్తే, అది ఖచ్చితంగా ఫలితమిస్తుందని ఇందులో పేర్కొన్నారు. ఉపవాసం పాటించే వ్యక్తి అన్ని కష్టాల నుండి బయటపడతాడు. అంతేకాకుండా. అతను జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతాడు. చివరికి అతను మోక్ష మార్గంలో పయనిస్తాడు.

2. గరుడ పురాణం ప్రకారం, మురికి బట్టలు ధరించే వారి అదృష్టం నాశనం అవుతుంది. లక్ష్మి ఎప్పుడూ అలాంటి ఇంటికి రాదు. అక్కడ ఎప్పుడూ పేదరికం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రమైన, సువాసనగల దుస్తులను ధరించడం మంచిది.

3. శత్రువులతో వ్యవహరించడానికి, అప్రమత్తత, తెలివిని ఆశ్రయించాలి. శత్రువులు నిరంతరం మనకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. మీరు తెలివిగా పని చేయకపోతే, కచ్చితంగా నష్టపోతారు. అందువల్ల, మీరు శత్రువు పెరుగుదలకు అనుగుణంగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. దానితో అతనిని అదుపులో ఉంచవచ్చని గరుడ పురాణం చెబుతుంది.

4. తులసి మొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, తులసిని ఇంట్లో ఉంచడం, రోజూ తినడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి స్వేచ్ఛ లభిస్తుంది అని గరుడ పురాణంలో చెప్పారు. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం ద్వారా, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. తులసిని దేవుని ప్రసాదంగా తీసుకోవడం శారీరక, మానసిక రుగ్మతలను తొలగిస్తుంది.

5. ఎవరైనా దేవత, మతాన్ని అవమానించిన వారు జీవితంలోఎప్పటికైనా పశ్చాత్తాపం చెంది తీరుతారు. అదేవిధంగా అతను నరకానికి వెళ్తాడు. పవిత్ర స్థలాలలో మురికి పని చేసేవారు, మంచి వ్యక్తులను మోసం చేసేవారు, వారి ప్రయోజనాల కోసం పక్కవారిని దుర్వినియోగం చేయడం, మతం, వేదాలు, పురాణాలు, గ్రంథాల ఉనికిని ప్రశ్నించే వారిని ఎవరూ నరకం నుండి రక్షించలేరని చెబుతుంది గరుడ పురాణం.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజలలో సాధారణ ఆధ్యాత్మిక ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ విషయాలను ఇక్కడ అందచేస్తున్నాం.

Also Read: సడెన్ గా రైడర్ అవతారమెత్తిన సద్గురు.. బైక్ పై రయ్యిమంటూ చక్కర్లు .. వీడియో వైరల్

Bhagavad-Gita: ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.. అది ఏమిటంటే