పచ్చిచేపను కసకస కొరికి తినేసిన శ్రీలంక మాజీ మంత్రి..ఎందుకంటే ?

కరోనా వైరస్ వల్ల ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏది వాస్తవం? ఏది అవాస్తవమని తెలుసుకోలేక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు.

పచ్చిచేపను కసకస కొరికి తినేసిన శ్రీలంక మాజీ మంత్రి..ఎందుకంటే ?
Follow us

|

Updated on: Nov 19, 2020 | 7:59 AM

కరోనా వైరస్ వల్ల ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏది వాస్తవం? ఏది అవాస్తవమని తెలుసుకోలేక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు. ఇటీవల సముద్రపు ఆహారం- సీఫుడ్‌ వల్ల కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో చాలా ఏరియాలో ప్రజలు సీఫుడ్‌కి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని ఓ మాజీ మంత్రి.. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఏకంగా పచ్చి చేపనే నమిలి తినేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీలంకకు చెందిన దిలీప్ వెదారచ్చి 2019 వరకు మత్య్స శాఖ మంత్రిగా పనిచేశారు. సముద్ర ఆహారం వల్ల కూడా కోవిడ్-19 వ్యాపిస్తుందనే ప్రచారం వల్ల ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారని తెలియడంతో దిలీప్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రచారం వల్ల జాలర్లకు ఉపాధి కరవవుతోందని భావించిన ఆయన.. సీఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పాలనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పచ్చి చేపను నోటితో కొరికి తిన్నారు. దీంతో వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

గతంలో మన దగ్గర బర్డ్‌ ఫ్లూ వచ్చిందని పుకార్లు రావడంతో.. మన నేతలు కూడా ఇలానే చేశారు. నిజాంగ్రౌండ్స్‌లో పెద్ద సభ పెట్టి… చికెన్ తిన్నారు. జనాల్లో భయాన్ని తొలగించేందుకే ఇలా చేశారు. అయితే అదంతా వండిన చికెనే… కాని శ్రీలంక మాజీ మంత్రి పచ్చిచేపని పరపర నమిలి మింగడం ఫస్ట్‌ టైమ్‌. సాధారణంగా మార్కెటింగ్‌ చేయడానికి ప్రతినిధులు ఇలాంటి ట్రిక్స్‌ వాడుతుంటారు. ప్రభుత్వ పెద్దలు కూడా రెవెన్యూ పడిపోకుండా ఇలా చేస్తుండడం వింత అనే చెప్పాలి.

Also Read : రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు