రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య తగ్గింది. ప్రతి రోజూ 1000 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య తగ్గింది. ప్రతి రోజూ 1000 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులను పూర్తిస్తాయిలో పునరుద్దరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 50 శాతం సిటీ బస్సులను నడుపాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. దీంతో బస్సులు రోడ్డెక్కాయి. ఇక ఏపీలో ఈ ప్రక్రియ ముందుగానే ప్రారంభమైంది. ఇప్పటిదాకా సొంత బస్సులన్నింటినీ రోడ్డెక్కించిన ఏపీఎస్ ఆర్టీసీ… డిసెంబర్ 1 నుంచి దశలవారీగా అద్దె బస్సులు తిప్పాలని నిర్ణయించింది.
గ్రామీణ ప్రాంతాల మీదుగా దూర ప్రాంతాల మధ్య నడిచే 290 అద్దె బస్సులు తిప్పేందుకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆర్టీసీ మేనేజ్‌మెంట్ ఆదేశాలిచ్చింది. సంస్థ నిబంధనలకు అనుగుణంగా బస్సులు తిప్పేలా అంగీకార పత్రం తీసుకోవాలని సూచించింది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను తిప్పాలని ఆర్టీసీ భావిస్తోంది.
Also Read :
తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ.. 21 మంది అభ్యర్థుల వివరాలు ఇవే..
జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. తొలగిస్తున్న అధికారులు