#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..

రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు 'ఆదిపురుష్' చిత్ర యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. ఈ సినిమాను 2022 ఆగష్టు...

#Adipurursh: ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సర్‌ప్రైజ్‌.. రిలీజ్ డేట్ ఫిక్స్..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 19, 2020 | 7:26 AM

రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. ఈ సినిమాను 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును విడుదల చేసింది. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకుడు కాగా.. సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రానికి హాలీవుడ్ విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్స్ పని చేయనున్నారట.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. మిగిలిన పాత్రల కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గానూ ఇప్పటికే అనుష్క, అనుష్క శర్మ, కీర్తి సురేష్‌, కియారా, కృతి సనన్ ఇలా పలువురి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్‌ ఆదిపురుష్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ విలువిద్యను సైతం నేర్చుకుంటున్నారు. 3డీలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో ఏకకాలంలో తెరకెక్కించనున్న ఈ మూవీని మిగిలిన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.