తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ.. 21 మంది అభ్యర్థుల వివరాలు ఇవే..

గ్రేటర్‌ ఎన్నికల సమరం క్రమంగా వేడెక్కుతోంది. తాజాగా బీజేపీ 21మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ 105 మందితో తొలిజాబితాను, కాంగ్రెస్‌ 29 మందితో తొలి జాబితా, 16 మందితో రెండో జాబితాను విడుదల చేశాయి. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌ 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది.

  • Sanjay Kasula
  • Publish Date - 11:21 pm, Wed, 18 November 20

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తొలిజాబితాను బీజేపీ విడుదల చేసింది . అందులో 21 మందికి చోటు కల్పించారు. నామినేషన్ల ఘట్టం మొదలైన తొలిరోజే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల తొలి జాబితాలు విడుదల చేసి గ్రేటర్‌లో హీట్‌ను మరింత పెంచేశాయి.