దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత..

బీ.టెక్ పూర్తి చేసి, భవిష్యత్తుపై కోటి ఆశలతో ఇంటికి వచ్చాడు యువకుడు వినయ్.‌ అయితే పని‌ నిమిత్తం బయటికి వెళ్లిన వినయ్ పై విధి‌ పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో వెక్కిరించి, దివ్యాంగుడిని చేసింది.

దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత..
Ravi Kiran

|

Aug 29, 2020 | 8:28 PM

Former MP Kavitha Helping Hand: బీ.టెక్ పూర్తి చేసి, భవిష్యత్తుపై కోటి ఆశలతో ఇంటికి వచ్చాడు యువకుడు వినయ్.‌ అయితే పని‌ నిమిత్తం బయటికి వెళ్లిన వినయ్ పై విధి‌ పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో వెక్కిరించి, దివ్యాంగుడిని చేసింది. ఇక వినయ్ దీన స్థితి గురించి తెలుసుకున్న మాజీ ఎంపీ, తెరాస నాయకురాలు కల్వకుంట్ల కవిత..వినయ్ వెన్ను తట్టారు. మానవత్వంతో స్పందించిన మాజీ ఎంపీ కవిత, శనివారం వినయ్ కు మూడు చక్రాల స్కూటీని అందించారు‌.

కోరుట్ల పట్టణానికి చెందిన బోగ వినయ్ 2014 లో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.‌ అనంతరం ఇంటికి వచ్చిన వినయ్, పని నిమిత్తం బయటికి వెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో వెన్నుముక కు తీవ్రంగా గాయాలవగా, కొన్ని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో వినయ్ కు శస్త్రచికిత్స చేయగా, చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.18 లక్షలు ఖర్చు చేశారు. ఆరేండ్లుగా వీల్ చైర్ కే పరిమితం అయిన వినయ్ పరిస్థితి చూసి, తల్లిదండ్రులు తీవ్రంగా మనోవేదన చెందారు.

వినయ్ పరిస్థితిపై ఓ పత్రికలో రావడం చూసిన మాజీ ఎంపీ కవిత, వినయ్ దీనావస్థ గురించి తెలుసుకుని చలించి పోయారు. వినయ్ తో నేరుగా మాట్లాడిన మాజీ ఎంపీ కవిత, అన్ని రకాలుగా అండగా ఉంటానని‌ భరోసా ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ లో వినయ్ కు , మూడు చక్రాల స్కూటీని అందించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. వినయ్ తల్లిదండ్రులతో కూలంకషంగా చర్చించిన‌ మాజీ ఎంపీ కవిత, వినయ్ ను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.‌ ఈ కార్యక్రమం లో కోరుట్ల‌ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు సైతం పాల్గొన్నారు. వినయ్ పరిస్థితి గురించి తెలుసుకుని, కుటుంబ సభ్యురాలిగా సహాయం అందించిన‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి మరియు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారికి వినయ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu