తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాద౦

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ ద్విచక్రవాహనంపైకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను నవీన్‌(50), సోమరాజు(32)గా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. మంగళవారం ఉదయం నవీన్, సోమరాజు తార్నాకలో బైక్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్ డిగ్రీ కాలేజ్ వద్ద యూ టర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా […]

తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాద౦
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:25 PM

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ ద్విచక్రవాహనంపైకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను నవీన్‌(50), సోమరాజు(32)గా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.

మంగళవారం ఉదయం నవీన్, సోమరాజు తార్నాకలో బైక్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్ డిగ్రీ కాలేజ్ వద్ద యూ టర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ వారిపై నుంచి దూసుకెళ్లింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే  ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.