ఒకే ఫ్రేమ్ లోకి రామ్ చరణ్.. ప్రభాస్, ఫ్యాన్స్ ఫుల్ జోష్.. నెట్టింట్లో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా..

ఒకే ఫ్రేమ్ లోకి రామ్ చరణ్..  ప్రభాస్, ఫ్యాన్స్ ఫుల్ జోష్.. నెట్టింట్లో వైరల్
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 18, 2020 | 9:56 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారడంతో ఈ పిక్ కు మరింత క్రేజ్ వచ్చింది. అదీ ఒకే ఫ్రేమ్ లో చిక్కడం అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50న పుట్టినరోజు వేడుకలకి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా అటెండ్ అయ్యారు. ఇందులో అందరి ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ చెర్రీ, ప్రభాస్ పిక్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది. ఫలితంగా ట్విట్టర్ ట్రెండ్స్ లోకి కూడా వచ్చేసారు. ఇక ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన మూవీ లవర్స్, వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.