AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS High Court: హైకోర్టుకు చేరిన పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం.. పోలీసుల పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ..

పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. జర్నలిస్టు సంతోష్ నాయక్‌ను చంపుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై

TS High Court: హైకోర్టుకు చేరిన పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం.. పోలీసుల పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ..
Shiva Prajapati
|

Updated on: Dec 18, 2020 | 10:06 AM

Share

పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. జర్నలిస్టు సంతోష్ నాయక్‌ను చంపుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను సంతోష్ నాయక్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నారని సంతోష్ నాయక్ తన పిటీషన్‌లో ఆరోపించారు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసి.. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేసేలా ఆదేశించి, తనకు న్యాయం చేయాలని కోర్టును సంతోష్ నాయక్ కోరాడు. సంతోష్ పిటీషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. కాగా, తనపై కథనాలు రాశాడనే కారణంగా జర్నలిస్ట్ సంతోష్ నాయక్‌ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..