దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,889 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,889 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 338 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల...

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,889 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 338 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 99,74,447 ఉండగా, మరణాలు 1,44,789కి చేరింది. ఇక కరోనా నుంచి 95,20,827 మంది కోలుకోగా, 3,13,831 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కాగా, నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 31,087 మంది కోలుకున్నారు.
ఇక దేశంలో రికవరీ రేటు 95.31 శాతం ఉండగా, మరణాల రేటు 1.45 ఉంది. అలాగే యాక్టివ్ కేసులు 3.24 శాతం ఉన్నట్లు తెలిపింది. తాజాగా కరోనాల నుంచి కోలుకున్న వారిలో ఐదు రాష్ట్రాల్లోనే 55 శాతం మంది ఉన్నారని పేర్కొంది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 15,89,18,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. ఇందులో నిన్న ఒక్క రోజే 11,13,406 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.
కాగా, దేశంలో గతంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా ఉండగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేకపోతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తుది దశలో ఉంది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 551 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?
Covid Vaccine: వచ్చే వారం జో బైడెన్‌కు కరోనా టీకా.. ధృవీకరించిన అధికార యంత్రాంగం..




