శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్.. 30 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఎర్రచందనం స్మగ్లర్లు పెరిగిపోతున్నారు. గత కొన్ని రోజుల కిందట టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో వారి అగడాలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా మొదలు...
ఎర్రచందనం స్మగ్లర్లు పెరిగిపోతున్నారు. గత కొన్ని రోజుల కిందట టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో వారి అగడాలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా మొదలు పెడుతున్నారు. తాజాగా పడమాల పేట సమీపంలో 30 మంది ఎర్ర చందనం దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ఈ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోకి వెళ్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.
కాగా, రెండు రోజుల కిందట కడప జిల్లాలో ఎర్రచంనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒంటిమిట్టకు చెందిన అంతర్‌రాష్ట్ర స్మగ్లరు బొడ్డే శ్రీనివాస్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. చింతరాజుల్లెకు చెందిన బొడ్డే శ్రీనివాసులు ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పర్చుకుని గత కొన్నేల్లుగా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఎర్రచందనం కేసుకు సంబంధించి పీడీ యాక్టులో సైతం జైలు శిక్ష అనుభవించాడు.
జైలు నుంచి బయటకు వచ్చిన తమిళ కూలీలతో కలిసి ఒంటిమిట్ట అడవి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను కొట్టించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తుండేవాడు. దీంతో ఓ వాహనంలో 20 ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధం చేసినట్లు ప్రత్యేక పోలీసు బృందాలకు సమాచారం అందడంతో దుద్యాల చెక్ పోస్టు వద్ద వాహనాన్ని తనిఖీ చేసి 12 ఎర్ర చందనం దుంగలను పట్టుకుని, వారిని అరెస్టు చేశారు.