AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణీకులకు గుడ్ న్యూస్..నేటి నుంచి గ్రేటర్‌లో 50 శాతం బస్సులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి 50శాతం బస్సులను తిప్పనున్నారు. లాక్​డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చినప్పటికీ...

ప్రయాణీకులకు గుడ్ న్యూస్..నేటి నుంచి గ్రేటర్‌లో 50 శాతం బస్సులు
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2020 | 8:43 AM

Share

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి 50శాతం బస్సులను తిప్పనున్నారు. లాక్​డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చినప్పటికీ… గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిపిస్తోంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో  బస్సుల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీకి సూచించారు. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నామని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఆర్టీసీకి గ్రేటర్ లో 45శాతం ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) వస్తుందని… రోజుకు సుమారు రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆదివారం, సెలవు రోజుల్లో ఆదాయం రూ.90 లక్షల వరకు పడిపోతుందని…మిగితా రోజుల్లో బాగానే ఉంటుందని ఆర్టీసీ అధికారులు వివరించారు . ప్రస్తుతం 1,700ల బస్సులను గ్రేటర్​లో తిప్పుతున్నామని… దాదాపు అన్ని రూట్లలో బస్సులు తిరిగే విధంగా చూస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఆయా రూట్లలో తిప్పుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

లాక్​డౌన్​ తర్వాత బస్సులను ప్రారంభించినప్పుడు ఆర్టీసీ సంస్థ గ్రేటర్​లో సుమారు 800 సర్వీసులు మాత్రమే తిప్పింది. ఓఆర్ తక్కువగా వచ్చినప్పటికీ… కరోనాను కట్టడిలో భాగంగా తక్కువ బస్సులు తిప్పింది. లాక్​డౌన్ తర్వాత గ్రేటర్​లో ప్రజా రవాణా ప్రారంభమైనప్పటికీ… సొంత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యమిచ్చారు. ప్రజా రవాణాపై అంతగా ఆసక్తి కనబరచకపోవడం వల్ల ఆర్టీసీకి ప్రారంభంలో అతి తక్కువ ఆదాయం వచ్చింది.

Also Read :

స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

కాజల్ హనీమూన్‌పై ట్రోలింగ్ !

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?