వైష్ణోదేవి భక్తులకు శుభవార్త

జమ్మూకశ్మీర్‌ లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు శుభవార్త. నవంబర్‌ 1 నుంచి ఆలయంలోకి నిత్యం 15 వేల మంది భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ పాలకవర్గం వెల్లడించింది. కొవిడ్-19 నిబంధనల కారణంగా ఇప్పటివరకు రోజూ 7 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ సంఖ్య మొదట్లో 2వేలుగా ఉంది. అయితే, తాజాగా అమ్మవారి దర్శనానికి అనుమతించే విషయంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలో స్వల్ప మార్పులు […]

వైష్ణోదేవి భక్తులకు శుభవార్త
Follow us

|

Updated on: Oct 30, 2020 | 10:40 PM

జమ్మూకశ్మీర్‌ లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు శుభవార్త. నవంబర్‌ 1 నుంచి ఆలయంలోకి నిత్యం 15 వేల మంది భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ పాలకవర్గం వెల్లడించింది. కొవిడ్-19 నిబంధనల కారణంగా ఇప్పటివరకు రోజూ 7 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ సంఖ్య మొదట్లో 2వేలుగా ఉంది. అయితే, తాజాగా అమ్మవారి దర్శనానికి అనుమతించే విషయంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలో స్వల్ప మార్పులు చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల దర్శనానికి సంబంధించిన అంశం మినహా ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలు యథావిధిగా నవంబర్‌ 30 వరకు అమల్లో ఉంటాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు 5 నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఆగస్టు 16న వైష్టోదేవి ఆలయాన్ని తిరిగి తెరిచిన విషయం విదితమే.