AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐయామ్ ఓకే.. త్వరలోనే వారిని కలుస్తాను…

టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ఆయన కోలుకుని మళ్లీ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. అయిదు రోజుల క్రితం హాట్ స్ట్రోక్ రావడంతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో కపిల్ చికిత్స తీసుకున్నారు.

ఐయామ్ ఓకే.. త్వరలోనే వారిని కలుస్తాను...
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 4:49 PM

Share

టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ఆయన కోలుకుని మళ్లీ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. అయిదు రోజుల క్రితం హాట్ స్ట్రోక్ రావడంతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో కపిల్ చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జ్ తరువాత తొలిసారిగా కపిల్ దేవ్ అభిమానులను తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు.

తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని కపిల్ దేవ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన తాను కోలుకోవాలంటూ ప్రార్థించిన అభిమానులు, క్రికెటర్లకు కృతజ్ఙతలు తెలిపారు. భారత్‌కు తొలిసారిగా ప్రపంచకప్‌ను సాధించి పెట్టిన 1983 జట్టును కలుసుకోవాలని ఉందని అన్నారు. త్వరలోనే 1983-వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యామిలీని కలుస్తానని అన్నారు. 1983 వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యామిలీని వీలైనంత త్వరగా కలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరికొచ్చేసిందని, వచ్చే ఏడాది ప్రారంభం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కపిల్ దేవ్ అందులో పేర్కొన్నారు.

Follow Us