ATM Charges : ఏటీఎం నుంచి డబ్బులు తీసేటప్పుడు ఈ విషయంపై ఫోకస్ పెట్టండి..తప్పు చేశారో బాదుడు తప్పదు !
పక్కన ఏటీఏం కనిపించింది. పరుగు..పరుగున వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారా..అయితే ఈ సారి అలా చేసేముందు ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని గుర్తుంచుకోండి.

పక్కన ఏటీఏం కనిపించింది. పరుగు..పరుగున వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారా..అయితే ఈ సారి అలా చేసేముందు ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని గుర్తుంచుకోండి. డబ్బులు విత్ డ్రా చేసేముందు మీ ఖాతాలో అసలు ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండి. ఆ తర్వాతే డబ్బులు తీయడానికి సాహసించడి. ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేసినంత డబ్బులు లేకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకో..బ్యాంకుల వాయింపు మాములుగా ఉండదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ వంటి పలు బ్యాంకులు ఇలాంటి చార్జీలు వసూలు చేస్తున్నాయి. అందువల్ల ఏటీఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ డబ్బులు తక్కువ ఉండటం లేక డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఎస్‌బీఐ రూ.20 చార్జీ వేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూ.25 వినియోగదారులకు వడ్డిస్తుంది. యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి కూడా ఇదే తరహా చార్జీలను వసూలు చేస్తున్నాయి. సో బీ కేర్‌ఫుల్.
Also Read :
Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !
Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..
