Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..
తిరుమల తిరుపతి దేవస్థానంపై తరుచుగా సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై టెంపుల్ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శ్రీవారి ఆలయంపై ఏర్పాటు చేసిన విద్యుత్..

తిరుమల తిరుపతి దేవస్థానంపై తరుచుగా సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై టెంపుల్ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శ్రీవారి ఆలయంపై ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణను శిలువ గుర్తు అని ప్రచారం చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. సదరు గుర్తును భక్తులకు చూపించి..అది శిలువ గుర్తా..లేక కలశం గుర్తో చెప్పాలన్నారు. ఈ విషయంపై స్పందించిన శ్రీవారి భక్తులు టీటీడీపై తప్పుడు ప్రచారం మానుకోవాలంటూ ఫైర్ అయ్యారు. శిలువ పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీయోద్దని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్పారు.
ఆలయ అలంకరణలకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించారు పాలకమండలి సభ్యులు. పవిత్రమైన కలశాన్ని శిలువగా మార్ఫింగ్ చేసి కుట్రపూరితంగా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు తమ వైఖరిని మార్చుకోవాలని..లేకపోతే కఠిన శిక్షలు తప్పవన్నారు. శ్రీవారి భక్తులెవ్వరూ టీటీడీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి కోరారు.
Also Read :