పంజాబ్ లో పెల్లుబికిన అన్నదాతల నిరసన, 1500 టెలికాం టవర్ల ధ్వంసం, కేబుల్స్ కట్, విద్యుత్ సర్వీసులకు బ్రేక్
పంజాబ్ రాష్ట్రంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 1500 టెలికాం టవర్లను వారు ధ్వంసం చేశారు. టవర్స్ మీదికి ఎక్కి కేబుల్స్ కట్ చేశారు. టెలికాం సిగ్నల్స్ ఇచ్ఛే టవర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పంజాబ్ రాష్ట్రంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 1500 టెలికాం టవర్లను వారు ధ్వంసం చేశారు. టవర్స్ మీదికి ఎక్కి కేబుల్స్ కట్ చేశారు. టెలికాం సిగ్నల్స్ ఇచ్ఛే టవర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో పలు చోట్ల ఇలా రైతులు తమ కోపాన్ని టెలికం టవర్లపై చూపారు. కొత్త రైతు చట్టాలవల్ల ఎక్కువగా లాభపడే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జియో అధినేత ముకేశ్ అంబానీ కనబడడం వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది. నిన్న 1411 టవర్లు డ్యామేజీ కాగా సోమవారం ఈ సంఖ్య 1500 దాటిపోయిందని రైతుల సన్నిహితవర్గాలు తెలిపాయి. జలంధర్ లో జియోకు చెందిన కొన్ని ఫైబర్ కేబుళ్ల బండిల్స్ ని వారు కాల్చేశారు. ఈ సిటీలో 9 వేల ప్లస్ టవర్స్ ఉన్నాయి. ఓ టవర్ వద్ద ఉన్న ఒక జనరేటర్ ను రైతులు ఎత్తుకుపోయి స్థానికంగా ఉన్న గురుద్వారాకు ఇచ్ఛేశారట.
అయితే రాష్ట్రంలో ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం అమరేందర్ సింగ్ పోలీసులను ఆదేశించారు. ఈ విధమైన చర్యలకు దిగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందిపడతారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
#WATCH Villagers of Tibbi Kalan in Punjab’s Firozpur vandalise a telecom tower to express their support towards farmers protesting against the three farm bills pic.twitter.com/sCWMYiU0Kq
— ANI (@ANI) December 28, 2020



